ముంబై: బిగ్ బీ అబితాబ్ వ్యాఖ్యాతగా కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) 12 వ సీజన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాపులరైన ఈ షోలో తెలంగాణ నుంచి సబితా రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో ఆమె టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, ఎప్పుడూ సరదా సరదాగా షోను నడిపించే బిగ్ బీ సబితా లైఫ్ జర్నీ గురించి తెలుసుకుని విచలితుడయ్యారు. భర్తను కోల్పోయి, పిల్లలను పెంచి పెద్ద చేసిన తీరు పట్ల ఆయన ప్రశంసలు కురింపిచారు. స్ఫూర్తిమంతమైన జీవన ప్రయాణమని అమితాబ్ కొనియాడారు. ఒక టీచర్‌గా పిల్లలకు మంచి విద్యను అందిస్తానని సబిత చెప్పుకొచ్చారు. జీవితంలో పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా కానీ, మంచి విద్యను అందివ్వాలని చెప్పారు. ఆమె పాల్గొన్న కేబీసీ సీజన్ 12, ఆరో ఎపిసోడ్ సోనీ టీవీలో నేటి రాత్రి (మంగళవారం) ప్రసారమవనుంది. ప్రస్తుతం సోనీ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు ఈ ఎపిసోడ్ అందుబాటులో ఉంది.
(చదవండి: స్నేహితుడికి అమితాబ్ ఫన్నీ రిప్లై)
సబితారెడ్డి పిల్లలు
అమ్మ కోరిక మేరకు
ఇక కేబీసీ సీజన్ 12, ఆరో ఎపిసోడ్‌లో సబితారెడ్డితో పాటు మరో 7 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. కంటెస్టెంట్ ప్రదీప్‌కుమార్ సూద్ బిగ్ బీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి 12.5 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుని ఆట నుంచి పక్కకు తప్పుకున్నారు. కేబీసీలో పాల్గొనడం తన తల్లి కోరిక అని ప్రదీప్ చెప్పారు. ఆమె కల నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. గతంలో కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నించానని ఈసారి ఆ అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సీనియర్ డివిజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రదీప్ తర్వాత సబితారెడ్డి కేబీసీ క్విజ్‌లో పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ కొద్ది రోజుల క్రితం కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.
(చదవండి: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పేరుతో ఘరానా మోసం)
కౌన్ బనేగా కరోడ్‌పతిలో తెలంగాణ టీచర్
Published Tue, Oct 6 2020 10:04 AM | Last Updated on Tue, Oct 6 2020 1:11 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment