ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించడానికి మీ ముందుకు వస్తున్నారు. భారతీయ టెలివిజన్ రంగంలోనే అత్యంత విజయవంతమైన షోగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి'కి పేరుంది. తాజాగా సోనీ టీవీ తన ట్వీటర్ వేదికగా తెలియజేస్తూ.. కౌన్ బనేగా కరోడ్‌పతి ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి అయ్యాయి. 2000 నుంచి ఈ షో ప్రారంభమైంది. ఆగష్టు 14 నుంచి సీజన్-15 ప్రారంభం కానుంది.
ఈ షో కోసం హోస్ట్‌గా వ్యవహరించేందుకు అమితాబ్ బచ్చన్ రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని షోలను ఆయనే విజయవంతంగా నడిపారు. అందుకు సంబంధించి అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.
2000లో ప్రారంభం అయిన మొదటి సీజన్ అత్యంత ప్రశంసలు పొందింది. షో మొదటి సీజన్‌లో ప్రైజ్ మనీ రూ.1 కోటి ఉండగా 2005లో వచ్చిన రెండో సీజన్‌లో ప్రైజ్ మనీ రెండింతలు పెరిగి రూ.2 కోట్లకు చేరింది. అలా మూడో సీజన్ వరకు అలాగే ఉంది. 2010లో సీజన్ 4 ప్రైజ్ మనీని మళ్లీ రూ.1 కోటికి తగ్గించారు. కానీ 2013లో వచ్చిన ఏడో సీజన్ నుంచి ప్రైజ్ మనీని ఒక్కసారిగా రూ.7 కోట్లకు పెంచారు. ఈసారి ఎంత ప్రైజ్ మనీ అనేది తెలియాల్సి ఉంది.
అమితాబ్ రెమ్యునరేషన్
షో ప్రారంభ సమయంలో అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.25 లక్షలు వసూలు చేశారు. మొదటి సీజన్ హిట్ కాగానే అమితాబ్ తన ఫీజును కోటి రూపాయలకు పెంచేశారు.పలు మీడియా కథనాల ప్రకారం ఆయన 6,7 సీజన్లలో రూ. 1.5 నుంచి 2 కోట్ల వరకు తీసుకున్నారు. కానీ 8వ సీజనలో అది కాస్త రూ.2 కోట్లకు చేరింది. ఎనిమిదవ సీజన్‌లో రాణి ముఖర్జీ, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే వంటి తారలు కూడా ఆ స్టేజీపైన మెరిశారు. ఆ తర్వాత 9వ సీజన్‌లో అమితాబ్ బచ్చన్ రూ.2.6 కోట్లు తీసుకున్నారు.
ఆ సీజన్‌లో హాట్ సీట్‌లో క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి విద్యాబాలన్ అతిథులుగా కనిపించారు. 10వ సీజన్‌లో అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 కోట్లు వసూలు చేశారు. ఆ సంవత్సరం ప్రత్యేక పోటీదారులలో ఆయుష్మాన్ ఖురానా, అమీర్ ఖాన్ ఉన్నారు. 11, 12, 13వ సీజన్లలో మెగాస్టార్ అమితాబ్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 3.5 కోట్లు తీసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 13వ సీజన్‌కు క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్‌లతో సహా చాలా మంది బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. ఈ సీజన్ కోసం రూ. 4 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని బాలీవుడ్ మీడియా తెలుపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment