
ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పాపులర్ టీవీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) ప్రజల్లో ఎంత పాపులరిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చేప్పనక్కర్లేదు. ఎంతో మంది జీవితాలను మార్చేసిన ఈ షో ప్రస్తుతం 12 సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ముగ్గురు కోటి రుపాయలు గెల్చుకోగా వారంతా మహిళలే కావడం విశేషం. కేబీసీలో ప్రస్తుతం విజయ్ పాల్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి హాట్ సీటుకు చేరుకుని ఆడే అవకాశం దక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్‌కి చెందిన విజయ్‌ది చాలా బీదరిక కుటుంబ నేపథ్యం. కొరియర్ బాయ్‌గా పనిచేస్తూ నెలకు 8 వేల రూపాయలను సంపాదిస్తున్నాడు. పోలీసు అధికారి కావాలనే లక్ష్యంతో కేబీసీలోకి అడుగుపెట్టాడు. చదవండి: ముగ్గురు కేబీసీ కోటీశ్వరులు
ఇప్పటివరకు అడిగిన అన్ని ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానాలు చెపుతూ, తక్కువ లైఫ్‌లైన్‌లు ఉపయోగించుకుంటూ, అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. ఈ క్రమంలో నేడు(గురువారం) కోటి రూపాయల ప్రశ్నను ఎదుర్కోనున్నాడు. ఓ వైపు ఆటను విజయవంతంగా కొనసాగిస్తూనే మరోవైపు హీరోయిన్ కియారా అద్వానీపై విజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు కియారా అంటే చాలా ఇష్టమని తెలిపాడు. ఆమె నటించిన అన్ని సినిమాలు చూసినట్లు పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన బిగ్‌బీ.. కియారాను అభిమానిస్తున్నవా అని అడిగాడు. కియారాపై చాలా కాలంగా క్రష్ ఉందని..ఆమెను ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మనసులోని మాటను బయట పెట్టాడు. అంతేకాదు ఎపుడూ కియారా ఫోటోను తన వద్ద ఉంచుకుంటానంటూ మురిసిపోయాడు. ప్రస్తుతం కూడా ఆమె ఫోటో ఉందని జేబులో నుంచి తీసి అమితాబ్‌కు చూపిస్తూ సిగ్గుల మొగ్గ అయ్యాడు. చదవండి: ‘ఇప్పటికి నా భార్యకి లవ్ లెటర్స్ రాస్తాను’
Comments
Please login to add a commentAdd a comment