14 ఏళ్ల బుడతడు.. పాతిక లక్షలు గెలిచాడు | KBC 12 Anmol Shastri 14 Years Old From Gujarat Won 25 Lakh Rupees | Sakshi
Sakshi News home page

కేబీసీ 12: బిగ్‌ బీనే భయపెట్టిన బుడతడు

Published Tue, Dec 15 2020 2:56 PM | Last Updated on Tue, Dec 15 2020 6:53 PM

KBC 12 Anmol Shastri From Gujarat Won 25 Lakh Rupees - Sakshi

కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రస్తుతం 12వ సీజన్‌ నడుస్తోం‍ది. కేబీసీలో ప్రస్తుతం స్టూడెంట్స్‌ స్పెషల్‌ నిర్వహిస్తున్నారు. అంటే కేవలం విద్యార్థులకే ఎంట్రీ అన్నమాట. పిల్లలు కదా అని వారిని తక్కువ అంచానా వేయడానికి లేదు. తెలివితేటల్లో పెద్దవారికి ఏ మాత్రం తీసి పోరు అని నిరూపించారు. ఇక నిన్నటి ఏపిసోడ్‌లో గుజరాత్‌కు చెందిన అన్‌మోల్‌ శాస్త్రి ఫాస్టెస్ట్‌ ఫింగర్‌ ఫాస్ట్‌లో గెలిచి హాట్‌సీటులో కూర్చున్న తొలి కంటెస్టెంట్‌గా నిలిచాడు. అమితాబ్‌ ఎదురుగా.. హాట్‌సీటులో కూర్చున్న తర్వాత పెద్దవారే కాస్త ఆందోళన చెందుతారు. కానీ అన్‌మోల్‌ ఏ మాత్రం టెన్షన్‌ పడలేదు. పైగా అమితాబ్‌నే ప్రశ్నలు వేస్తూ ఆశ్చర్యపరిచాడు. ఇక అమితాబ్‌ను అంత దగ్గర నుంచి చూడగానే అన్‌మోల్‌ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఇక చిన్నారికి వాటర్‌ ఇచ్చి.. హాట్‌సీటులో కూర్చొపెట్టాడు అమితాబ్‌. ఆ తర్వాత అతడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక అన్‌మోల్‌ తన మూడు కోరికల గురించి వెల్లడించాడు. మొదటిది.. నోబెల్‌ ప్రైజ్‌ గెలవడం.. రెండవది ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలవడం.. మూడవది ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక ఏపీజే అబ్దుల్‌ కలాం, స్టీఫెన్‌ హాకింగ్‌ తనకు ఇష్టమైన శాస్త్రవేత్తలని తెలిపాడు. ఇక ఈ షోలో తాను గెలిచే డబ్బుతో ఓ టెలిస్కోప్‌ కొంటానన్నాడు చిన్నారి అన్‌మోల్‌. (చదవండి: కేబీసీ 12 రికార్డు.. కోటీశ్వరులైన ముగ్గురు స్త్రీలు)

ఇక అన్‌మోల్‌ ముక్కుసూటితనానికి, చొరవకి అమితాబ్‌ ఫిదా అయ్యాడు. బుడతడికి ‘జిగ్యసు’ అని నిక్‌నేమ్‌ పెట్టాడు. ఇక ఈ షోలో అన్‌మోల్‌ 25 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. 14 ఏళ్ల బుడతడు ఇంత పెద్ద మొత్తం గెలవడం అంటే సాధారణ విషయం కాదు. ఇక 20 వేల రూపాయల ప్రశ్నకు అన్‌మోల్‌ ఏమాత్రం తడబాటు లేకుండా వెంటనే సమాధానం చెప్పడంతో బిగ్‌ బీ ఆశ్చర్యపోయాడు. ఇక ఆ ప్రశ్న ఏంటంటే.. కామిక్‌ బుక్స్‌ ప్రకారం ఓ టీనేజర్‌ని రేడియోయాక్టివ్‌ సాలీడు కుడుతుంది. దాంతో అతడికి మానవాతీత శక్తులు వచ్చి ఎత్తైన గోడల్ని అలవోకగా ఎక్కుతుంటాడు అని ప్రశ్నించాడు. ఇందుకు పీటర్‌ పార్కర్‌, బ్రూస్‌ వేనే, టోని స్టార్క్‌, స్టీవ్‌ రోజర్స్‌ అని నాలుగు ఆప్షన్స్‌ ఇస్తాడు. వెంటనే అన్‌మోల్‌ కరెక్ట్‌ పీటర్ ‌పార్కర్‌ అని కరెక్ట్‌ సమాధానం చెప్తాడు. అంతేకాక ఇక సూపర్‌హీరో పాత్రలు పోషించిన మిగతా హీరోల పేర్లు చెప్పడంతో అమితాబ్‌ షాక్‌ అవుతాడు. ఆ తర్వాత భవిష్యత్తులో అన్‌మోల్‌ వల్ల తన హోస్ట్‌ జాబ్‌కి ప్రమాదం ఉంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తాడు. ఇక రెండో ప్రశ్నకు 50-50 లైఫ్‌లైన్‌ వాడుకున్న అన్‌మోల్ మళ్లీ ఏడవ ప్రశ్నకు మూడవ లైఫ్‌లైన్‌ వాడుకున్నాడు. ఆ తర్వాత 25 లక్షల రూపాయల ప్రశ్నకు చివరి లైఫ్‌లైన్‌ వాడుకున్నాడు. (చదవండి: అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంతే..)

ఇక 25 లక్షల రూపాయల ప్రశ్న ఏంటంటే  టెలిస్కోప్‌ సాయంతో గుర్తించిన మొదటి గ్రహం ఏది అనే ప్రశ్నకు అన్‌మోల్‌ తన చివరి లైఫ్‌లైన్‌ వాడుకుని సరైన సమాధానం యూరెనస్‌ అని చెప్తాడు. ఆ తర్వాత 50 లక్షల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో క్విట్‌ అయ్యాడు. ఇక అన్‌మోల్‌ తనకు హౌ ఇట్‌ వర్క్స్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ చానెల్‌ ఉందని బిగ్‌ బీతో చెప్తాడు. దానిలో తాను ఫిజిక్స్‌, బయోలాజికి సంబంధించిన వీడియోలు పొస్ట​ చేస్తానని వెల్లడించాడు. దాంతో అమితాబ్‌ అన్‌మోల్‌ చానెల్‌ లింక్‌ని తనకు షేర్‌ చేయమని.. తన సోషల్‌ మీడియాలో అతడి చానెల్‌ని ప్రమోట్‌ చేస్తానని వెల్లడించాడు. దాని వల్ల అతడి చానెల్‌ని ఎక్కువ మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటారన్నారు బిగ్‌ బీ. అంతేకాక తాను కూడా అన్‌మోల్‌ చానెల్‌ని సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటానని వెల్లడిస్తాడు బిగ్‌ బీ. ఇక 25 లక్షల రూపాయల మొత్తంతో అన్‌మోల్‌ షో నుంచి క్విట్‌ అవుతాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement