అమితాబ్ స్థానంలో వేరొకరా? | no one can replace amitabh bachchan in kbc, say producers | Sakshi
Sakshi News home page

అమితాబ్ స్థానంలో వేరొకరా?

Published Sat, May 20 2017 6:35 PM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

అమితాబ్ స్థానంలో వేరొకరా?

అమితాబ్ స్థానంలో వేరొకరా?

హమారే సాథ్ హాట్‌ సీట్‌ మే హై.. కంప్యూటర్‌ జీ లాక్ కర్ దీజియే.. ఈ డైలాగులు చెప్పాలంటే గంభీరమైన బేస్ వాయిస్‌ ఉండాల్సిందే. ఆ వాయిస్ అమితాబ్ బచ్చన్‌ది అయ్యి తీరాల్సిందే. ఆయన స్థానంలో మరొకరిని కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఊహించుకోవడం కూడా సాధ్యం కాదు. అలాంటిది ఈసారి సీజన్‌కు మాత్రం అమితాబ్‌కు బదులు ఆయన కోడలు, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను తీసుకొస్తారని, ఆమె కాదంటే అలనాటి మేటినటి మాధురీ దీక్షిత్‌కు అవకాశం ఇస్తారని కూడా వదంతులు వచ్చాయి. కానీ, వాటన్నింటినీ షో నిర్వాహకులు కొట్టిపారేశారు. తాము ఇప్పటివరకు ఎవరరికీ అలా చెప్పలేదన్నారు.

ఇలాంటి విషయాలు ఎక్కడినుంచి వస్తాయో తమకు తెలియడం లేదని, కేబీసీకి హోస్ట్ అంటే అమితాబేనని, ఆయన స్థానంలో వేరొకరు వచ్చేందుకు అవకాశమే లేదని కేబీసీ నిర్మాతలు చెప్పారు. ఇప్పటివరకు 8 సీజన్ల పాటు అప్రతిహతంగా నడిచిన కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఈసారి హోస్ట్ మారుతారని వచ్చిన కథనాలను వారు కొట్టిపారేశారు. ఒక్క మూడో సీజన్‌లో మాత్రం షారుక్ ఖాన్‌ను అమితాబ్‌కు బదులుగా హోస్ట్‌గా ఉంచినా, ఆ సీజన్ ఏమాత్రం సక్సెస్ కాకపోవడంతో మళ్లీ బిగ్ బీనే తీసుకురాక తప్పలేదు. దాంతో మరోసారి ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకునే పరిస్థితిలో నిర్మాతలు లేరని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement