
ఎనిమిదో సారి!
‘‘మీరు ప్రైజ్ మనీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టెన్షన్ పడక్కర్లేదు. కూల్‌గా ఆడండి’’ అంటూ కామన్ మ్యాన్‌ని ఓ స్టార్ ఎంకరేజ్ చేస్తూ, వాళ్లతో ఆత్మీయంగా మాట్లాడితే చూడ్డానికి బాగుంటుంది. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ హోస్ట్‌గా అమితాబ్ బచ్చన్ అలా వ్యవహరించారు కాబట్టి, నిజంగానే ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు ప్రైజ్ మనీ గెలుచుకునే వీలుంది కాబట్టి, ఆ షో సూపర్ హిట్టయింది.
2000లో మొదలైన ఈ షోకి తొలి హోస్ట్ అమితాబ్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటి నుంచి 2014 వరకూ ఎనిమిది సీజన్లుగా సాగిన ఈ షోలో 7 సీజన్లు అమితాబే చేశారు. ఒకే ఒక్క షోకు షారుక్ ఖాన్ హోస్ట్‌గా చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రసారం కానున్న తొమ్మిదో సీజన్‌కు అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.అంటే.. ఎనిమిదో సారి చేయనున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మూడేళ్ల తర్వాత ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అంటూ బిగ్ బి చేయనున్న సందడి కోసం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బి కూడా చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నారు.