ఓ తండ్రి పోరాటం.. కదిలించేలా కేబీసీ టీజర్‌ | Amitabh Bachchan Kaun Banega Crorepati Season 10 Teaser | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 23 2018 9:08 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

గత తొమ్మిది సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తూ, విజయవంతంగా కొనసాగుతున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) కొత్త సీజన్‌ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన టీజర్‌ని సోనీ టెలివిజన్‌ సోమవారం విడుదల చేసింది. టెలివిజన్ రియాల్టీ షోలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కేబీసీ.. చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ షోకు బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హమారే సాథ్ హాట్‌ సీట్‌ మే హై.. కంప్యూటర్‌ జీ లాక్ కర్ దీజియే.. అంటూ బెస్‌ వాయిస్‌తో అమితాబ్‌ చెప్పే డైలాగ్‌లను ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. కూల్‌గా ఆడండి అంటూ బిగ్ బీ ఎదురుగా కూర్చున్న సామాన్యులను సైతం ఉత్సహపరుస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement