
కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) 11వ సీజన్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఆయన అడిగిన ప్రశ్నకు ఓ వ్యక్తి ఊహించని రీతిలో ఆన్సర్ ఇచ్చాడు. విషయంలోకి వస్తే మంగళవారం నాటి ఎపిసోడ్‌లో నితిన్ కుమార్‌తో గేమ్ కొనసాగింది. అతను మధ్యప్రదేశ్‌వాసి. ఒకవైపు తన తల్లికి జనరల్ స్టోర్ నడపడానికి సహాయపడుతూనే మరోవైపు ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. కాగా షో విరామంలో బిగ్‌బీ అతనితో కాసేపు సరదాగా సంభాషించారు. టిండర్ డేటింగ్ ఆప్ తెలుసా అని అడిగాడు. దానికి నితిన్ బదులిస్తూ తన మిత్రుల ద్వారా దాని గురించి విన్నానని సమాధానమిచ్చాడు.
అసలు టిండర్ ఆప్ అంటే ఏంటి? అని బిగ్‌బీ ప్రశ్నించగా నితిన్ అది ఎలా పనిచేస్తుందో చెప్పి, అదేమంత ఫేమస్ ఆప్ కాదని తీసిపారేశాడు. పైగా ‘డేటింగ్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. నా దుకాణంలోకే చాలా మంది అమ్మాయిలు వస్తూ పోతూ ఉంటార’ని చమత్కారంగా బదులిచ్చాడు. దీంతో ఆశ్చర్యపోవడం బిగ్‌బీ వంతయింది. ఇక నితిన్ కుమార్ షోలో రూ.3,20,000ల ప్రైజ్‌మనీ గెలుచుకుని ఇంటిబాట పట్టాడు. కాగా మరో కంటెస్టెంట్ హేమంత్ నందలాల్ ఇప్పటివరకు ఏ లైఫ్‌లైన్స్ వాడుకోకుండా 8వ ప్రశ్న వరకు వెళ్లి ఆటలో కొనసాగుతున్నాడు.