కొన్ని రియాల్టీ షోల ద్వారా హోస్టింగ్ చేసిన సెలెబ్రిటీలకు పేరొస్తుంది. మరికొన్ని రియాల్టీ షోలకు మాత్రం హోస్టింగ్ చేసిన సెలెబ్రిటీ ద్వారానే మంచి గుర్తింపు వస్తుంది. అలాంటి రియాల్టీ షోలలో`కౌన్ బనేగా కరోడ్‌పతి` ఒకటి. ఈ షో పేరు చెప్పగానే అందిరికి గుర్తొచ్చే పేరు అమితాబ్ బచ్చన్. ఈ షో సక్సెస్‌లో అబితాబ్ కీలక పాత్ర పోషించాడు.
ఇది కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందించి షో కాదు.. ఎన్నో అనుభూతులను కూడా పంచుతుంటుంది. హాట్‌సీట్‌లో కూర్చొని అబితాబ్ చెప్పే విషయాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 15వ సీజన్‌ని కూడా పూర్తి చేసుకుంది. డిసెంబర్ 29న చివరి ఎపిసోడ్ ప్రసారమవ్వగా.. షోకి వచ్చిన ప్రేక్షకులతో పాటు అబితాబ్ కూడా ఎమోషనల్ అయ్యారు.
(చదవండి: Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ)
`లేడీస్ అండ్ జెంటిల్మెన్.. మేం వీడ్కోలు పలుకుతున్నాం. ఈ వేదిక రేపట్నుంచి కనిపించదు. రేపట్నుంచి మేం ఇక్కడకు రావడం లేదు అని చెప్పాలనిపించడం లేదు. నేను, అమితాబ్ బచ్చన్, ఈ సీజన్‌లో చివరి సారిగా నేను చెప్పేది ఒక్కటే.. గుడ్ నైట్.. గుడ్ నైట్’ అంటూ అమితాబ్ భావోద్వేగానికి గురయ్యారు.
(చదవండి: Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్ హిట్స్)
అమితాబ్‌తో పాటు షోకి వెళ్లిన ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ‘మేం దేవుడిని చూడలేదు కానీ ఆ దేవుడికి అత్యంత ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నాం’అంటూ ఓ ప్రేక్షకురాలు చెప్పడంతో వేదిక అంతా చప్పట్లతో మారుమ్రోగింది.
కాగా, చివరి ఎపిసోడ్‌కి విద్యాబాలన్, షీలా దేవి, షర్మిలా ఠాగూర్, సారా అలీఖాన్ విచ్చేసి సందడి చేశారు. ఇదే చివరి ఎపిసోడ్. ఇకపై ఇక్కడకు రాలేము అనే మాటలు చెబుతున్నందుకు బాధగా ఉంది. ఇలాంటి రోజు వస్తుందని ముందే తెలుసు. నా ప్రేక్షకులతో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకుంటున్నాను’అని అమితాబ్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment