బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి. ప్రస్తుతం ఈ షో 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా జరిగిన ఎపిసోడ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హాట్ సీట్‌కు ఎంటర్ అయ్యేందుకు ఫాస్టేస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్‌లో గెలుపొందిన ఓ వ్యక్తి షర్డ్ విప్పి స్టేజ్‌పై హంగామా చేశాడు. అతన్ని చూసి బిగ్‌బి ఆశ్చర్యపోయిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
చదవండి: బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు
ఈ వీడియోలో అమితాబ్ విజయ్ గుప్తా అనే కంటెస్టెంట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్‌లో గెలిచినట్లు అనౌన్స్ చేశారు. అది విన్న ఆ వ్యక్తి సంతోషం పట్టలేక స్టేజ్‌పై రచ్చ రచ్చ చేశాడు. దీంతో స్టేజ్‌పైకి వస్తూనే షర్ట్ విప్పి స్టేజ్ చూట్టు తిరిగాడు. అంతేకాదు తన భార్య దగ్గరికి వెళ్లి ఆనందంతో హగ్ చేసుకున్నాడు. దాదాపు 45 ఏళ్లపైనే ఉండే ఈ వ్యక్తి ఒక్కసారిగా కుర్రాడిలా మారిపోయాడు. ఆయనను అలా చూసి షో హోస్ట్ బిగ్‌బితో పాటు ఆడియన్స్ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అతను మాత్రం చప్పట్లు కొట్టడం ఆపకండి అని ఆడియన్స్‌కు చెప్పుతూ స్టేజ్ అంతా పరుగెడుతూ నానా హంగామా చేశాడు.
చదవండి: అమెజాన్‌లో దూసుకుపోతున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’
ఇక కాసేపటికి హోస్ట్ అమితాబ్ సర్ కనీసం షర్ట్ అయినా వేసుకోండని అతడిని కోరారు. ఆ తర్వాత ‘కనీసం ఆయనను షర్ట్ వేసుకోనివ్వండి.. లేదంటే ఇంకా బట్టలు విప్పేస్తారేమోనని భయంగా ఉంది’ అని బిగ్‌బి చమత్కరించిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆయనను అలా చూసిన నెటిజన్లు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని గుర్తు చేసుకుంటున్నారు. 2000లో కప్ గెలిచిన అనంతరం సౌరవ్ గంగూలి తన జెర్సీని ఇప్పేసి స్టేడియం మొత్తం పరిగెడుతూ ఇలాగే చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Vijay Gupta ji ne jeet mein shirt utaar ke machayi dhamaal, lekin kya apne gyan se hotseat par woh karenge kamaal?
— sonytv (@SonyTV) August 25, 2022
Dekhiye #KaunBanegaCrorepati, aaj raat 9 baje, sirf Sony par.#KBC2022@SrBachchan pic.twitter.com/FpP2J7M8Is
Comments
Please login to add a commentAdd a comment