
గత తొమ్మిది సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తూ, విజయవంతంగా కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) కొత్త సీజన్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన టీజర్‌ని సోనీ టెలివిజన్ సోమవారం విడుదల చేసింది. టెలివిజన్ రియాల్టీ షోలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కేబీసీ.. చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ షోకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హమారే సాథ్ హాట్ సీట్ మే హై.. కంప్యూటర్ జీ లాక్ కర్ దీజియే.. అంటూ బెస్ వాయిస్‌తో అమితాబ్ చెప్పే డైలాగ్‌లను ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. కూల్‌గా ఆడండి అంటూ బిగ్ బీ ఎదురుగా కూర్చున్న సామాన్యులను సైతం ఉత్సహపరుస్తారు.
లఖాన్ యాదవ్ అనే ట్యాక్సీ డ్రైవర్ తన కొడుకు కోసం పడే కష్టాన్ని ఈ టీజర్‌లో చూపించారు. తన కొడుకుని చదివించడానికి యాదవ్ కుటుంబం చిన్న ఇంట్లోకి మారుతోంది. కొడుకుని మాత్రం పెద్ద స్కూల్‌లో జాయిన్ చేస్తారు. కొడుకు పెరుగుతున్న కొద్ది స్కూల్ ఫీజులు కూడా పెరుగసాగాయి.. దీంతో అతడు పగలు, రాత్రి తేడా లేకుండా ట్యాక్సీ నడుపుతాడు. యాదవ్ కొడుకు తనకు ఇంజనీర్ కావాలని ఉందంటాడు. కొడుకు కోరికను తీర్చడానికి ఇంజనీరింగ్ ఫీజ్ గురించి యాదవ్ భార్యతో చర్చించి.. అదే విషయం ఆలోచిస్తూ ఉంటాడు.
కట్ చేస్తే యాదవ్ బిగ్ బీతో హాట్ సీట్లో దర్శనమిస్తాడు. యాదవ్‌కి శుభాకాంక్షలు చెప్పిన బిగ్ బీ అతన్ని పరీక్షించడానికి ఒకవేళ మీరు ఈ గేమ్‌లో ఓడిపోతే అని అడగ్గా.. అతడు నేను ఇప్పటికి ఇంకా ఓడిపోలేదు సార్ అని సమాధానం చెబుతాడు. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించాలి లేదా వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అంటూ బిగ్ బీ చెబుతారు. ప్రస్తుతం ఈ ప్రోమో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment