అదే జోష్‌తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ | Meelo evaru koteeswarudu starts second edition host by Nagarjuna | Sakshi
Sakshi News home page

అదే జోష్‌తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’

Published Sun, Dec 21 2014 1:03 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

అదే జోష్‌తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ - Sakshi

అదే జోష్‌తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’

తొలి సీజన్ ముగిసినప్పుడు చాలా మంది బాధపడ్డారు. ఇక నుంచి సాయంత్రాలు ఎలా గడపాలనే సందిగ్ధత నెలకొందని వ్యాఖ్యానించిన ప్రేక్షకులూ ఉన్నారు. మరి ఆ లోటును తీర్చడానికే అన్నట్టుగా మొదలైంది ‘మీలో ఎవరు కోటీశ్వరుడు- సెకండ్ ఎడిషన్’. నటుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ క్విజ్ రియాలిటీ షో రెండో దశలో కూడా అంతే జోష్‌తో నడుస్తోంది. సామాన్యులు కూడా పాల్గొనే అవకాశం ఉన్న ఈ షోకి సెలబ్రిటీల తాకిడి కూడా ఉండటంతో మంచి వీక్షకాదరణ దక్కుతోంది.

నాగార్జున తనదైన శైలిలో హోస్ట్‌పాత్రను పోషిస్తూ అనేకమందిని ఈ కార్యక్రమానికి అభిమానులుగా మార్చేస్తున్నారు. రెండో ఎడిషన్‌లో కూడా స్టార్‌ల ఎంట్రీకేమీ లోటు లేదు. నితిన్, రకుల్‌ప్రీత్ సింగ్, సమంత వంటి సెలబ్రిటీలతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రెండో ఎడిషన్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement