భలే ప్లాన్‌ | nithya menen breathe shooting completed | Sakshi
Sakshi News home page

భలే ప్లాన్‌

Jun 7 2019 12:52 AM | Updated on Jun 7 2019 12:52 AM

nithya menen breathe shooting completed - Sakshi

నిత్యామీనన్‌

గాల్లో బెలూన్లు ఎగరేసి ఎంజాయ్‌ చేస్తున్నారు నిత్యామీనన్‌. ‘బ్రీత్‌’ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2 షూటింగ్‌ పూర్తికావడమే ఈ ఆనందానికి కారణం. ‘‘బ్రీత్‌’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. ఒకరినొకరం బాగా మిస్‌ అవబోతున్నాం అని చెప్పడానికి బాధగా ఉంది. ఇప్పటివరకు యాక్టింగ్‌లో నా బెస్ట్‌ టైమ్‌ ఇదేనని భావిస్తున్నాను’’ అన్నారు నిత్యా. ‘బ్రీత్‌’ సెకండ్‌ సీజన్‌లో అభిషేక్‌ బచ్చన్‌ నటించారు. ఫస్ట్‌ సీజన్‌లో మాధవన్‌ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అన్నట్లు .. ఇంకో విషయం ఏంటంటే వెబ్‌సిరీస్‌లో నిత్యా నటించడం ఇదే తొలిసారి.

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌వైపు మళ్లిన నిత్యాకు చేతిలో సినిమాలు లేవనుకుంటే మాత్రం పొరపాటే. ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాతో ఈ ఏడాదే బాలీవుడ్‌ డోర్‌ కొట్టిన ఈ బ్యూటీ సౌత్‌లోనూ మస్త్‌ బిజీగా ఉన్నారు. తమిళంలో సైకో, ది ఐరన్‌లేడీ (జయలలిత బయోపిక్‌) సినిమాలతో పాటు కొన్ని మలయాళ చిత్రాలు చేస్తున్నారు. అలాగే మరికొన్ని వెబ్‌ సిరీస్‌లో నటించడానికి కథలు వింటున్నారట. ఇలా సినిమాలు, డిజిటల్‌ సెక్టార్‌ని బ్యాలెన్స్‌ చేస్తూ కెరీర్‌ను భలేగా ప్లాన్‌ చేసుకుంటున్నారు నిత్యామీనన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement