Breathe
-
హీరోగా ఫస్ట్ మూవీ డిజాస్టర్.. కానీ ఇప్పుడు మరో సినిమా!
నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఉన్నారు. కానీ అందులో క్లిక్ అయి, పాన్ ఇండియా లెవల్లో ఫేమ్ తెచ్చుకున్నది అంటే జూ.ఎన్టీఆర్ ఒక్కడే. కానీ గతేడాది ఈ కుటుంబం నుంచి చైతన్య కృష్ణ అనే మరో హీరో లాంచ్ అయ్యాడు. 'బ్రీత్' అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. అయితే ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడు ఇతడు మరో మూవీకి కమిట్ అయ్యాడు. (ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్) ఎన్టీఆర్ కొడుకుల్లో జయకృష్ణ ఒకరు. ఈయన కొడుకే చైతన్య కృష్ణ. గతంలో జగపతిబాబు హీరోగా వచ్చిన 'ధమ్' మూవీలో పెద్దగా గుర్తింపు లేని ఓ పాత్ర చేశారు. ఒకే ఒక్క సినిమాతో పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. కానీ చాన్నాళ్ల తర్వాత 'బ్రీత్' మూవీ చేశాడు. తండ్రి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాతో కొడుకు చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. గతేడాది థియేటర్లలోనే ఏ మాత్రం కలెక్షన్స్ తెచ్చుకోని 'బ్రీత్' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ క్రమంలోనో ట్రోలర్స్ రెడీ అవుతుండగా.. ఇప్పుడు ఈ హీరో మరో కొత్త మూవీ చేయబోతున్నాడనే వార్త ట్రోలర్స్‌కి స్టఫ్ ఇస్తోంది. జీకే చౌదరి అనే కో-డైరెక్టర్.. చైతన్యకృష్ణతో సినిమా చేయబోతున్నట్లు ఫేస్బుక్లో ఓ ఫొటో చేశారు. అయితే అన్నీ తెలిసి కూడా మరో సినిమా అంటే 'సాహసమనే చెప్పాలి' అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. (ఇదీ చదవండి: పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు) -
ఇక శ్వాసతోనే క్యాన్సర్‌ను కనిపెట్టొచ్చు!
రూర్కీ: రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ను వ్యయప్రయాసలు లేకుండా కేవలం శ్వాస ఆధారంగానే కనుగొనే కొత్త విధానాన్ని ఐఐటీ–రూర్కీ పరిశోధకులు అభివృద్ధిచేశారు. ప్రొఫెసర్ ఇంద్రాణి లాహిరి, ప్రొఫెసర్ పార్థా రాయ్, ప్రొఫెసర్ దిబ్రుపా లాహిరి తదితరులు రూపొందించిన ఈ డిటెక్టర్ రంగుల వేర్వేరు గాఢతలను వివరించే కలరీమెట్రీ సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ‘ చిన్న పరిమాణంలో ఉండే ఈ స్క్రీనింగ్ డివైజ్‌ను ఉపయోగించడం చాలా తేలిక. ఈ డివైజ్‌లోకి సంబంధిత వ్యక్తి గట్టిగా గాలి ఊదితే చాలు వెంటనే డివైజ్‌లో ఒక కలర్ కనిపిస్తుంది. ఏ రోగానికి ఏ రంగు అనేది ముందే నిర్దేశితమై ఉంటుందిగనుక వాటిని పోలిచూసి రొమ్ము, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లలో ఏదైనా వ్యాధి ప్రబలిందా లేదా చెక్ చేయవచ్చు’ అని పరిశోధనలో కీలకభూమిక పోషించిన ప్రొఫెసర్ ఇంద్రాణి లాహిరి వివరించారు. ‘క్యాన్సర్‌ను తొలినాళ్లలోనే కనుగొంటే చాలా ఉత్తమం. అప్పుడే దాని నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయి’ అని ఐఐటీ–రూర్కీ తాత్కాలిక డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంఎల్ శర్మ అన్నారు. ‘ఈ ఉపకరణంతో కోట్లాదిమంది ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రాణాంతక రోగం ముదిరి వ్యాధి చికిత్సకు లక్షలు పోసే బదులు ముందే వ్యాధిని గుర్తించేందుకు ఇది సాయపడనుంది’ అని ఆయన అన్నారు. ఈ పరికరం ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దీని సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. డిటెక్టర్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు టాటా స్టీల్‌తో సాంకేతిక బదిలీ ఒప్పందాన్ని ఐఐటీ–రూర్కీ చేసుకుంది. హెల్త్ టెక్నాలజీలో విదేశాలపై ఆధారపడకుండా దేశీయ జ్ఞానాన్ని ఒడిసిపట్టేందుకే టెక్నాలజీ, న్యూ మెటీరియల్స్ బిజినెస్ పేరిట టాటా స్టీల్ విడిగా ఒక ప్రత్యేక విభాగాన్ని నిర్వహిస్తోంది. ఆరోగ్య ఉపకరణాల రంగంలో స్వావలంబనకు ఈ సంస్థ కృషిచేస్తోంది. ప్రధాని మోదీ నినదించిన ఆత్మనిర్భరత భారత్ కోసం శ్రమిస్తోంది. ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ కోసం రక్తం అమ్ముకునే యత్నం.. -
పీల్చే గాలిని సైతం విషంగా మార్చిన ఉక్రెయిన్ యుద్ధం!
Lot of smoke in Kyiv, people can't breathe properly: రష్యా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున క్షిపణి దాడులు నిర్వహిస్తోంది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ మొత్తం దట్టమైన పొగ మేఘంతో కప్పబడి ఉంది. దీంతో ఉక్రెయిన్ అధికారులు గాలి నాణ్యత.. అనారోగ్యకరమైన స్థాయిలో ఉందని నివాసితులు తమ కిటికీలు తెరవవద్దని, అనవసరంగా తమ ఇళ్లను విడిచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక వాయు నాణ్యత మార్గదర్శక విలువ కంటే ప్రస్తుతం కీవ్‌లోని గాలిలో కాలుష్య కారకాల సాంద్రత 27.8 రెట్లు ఎక్కువగా ఉందని ఓ నివేదిక తెలిపింది. మార్చి19 నుంచి వాయు నాణ్యత ప్రమాదకరంగా ఉందని నివేదిక పేర్కొంది. అంతేకాదు కీవ్‌లో పొగ ఎక్కువగా ఉందని, ప్రజలు సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. అతేకాదు గాలిలో పొగలు కమ్ముకుంటున్నందున ప్రజలు తమ కిటికీలు తెరవవద్దని, అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నగర పాలక సంస్థ కూడా ప్రజలను కోరింది. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి కీవ్‌లో అనేక పేలుళ్లు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఉక్రెయిన్- రష్యా వార్ ముఖ్యాంశాలు ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ప్రకటించి 24 రోజులైంది. ఐక్యరాజ్యసమిది నివేదిక ప్రకారం, 3.2 మిలియన్ల మంది ప్రజలు దేశం నుంచి పారిపోగా, మరో 6.5 మిలియన్ల మంది ఉక్రెయిన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ యుద్ధంలో వందలాది మంది పౌరులతో పాటు, 112 మంది పిల్లలు మరణించారని దాదాపు 13 వేల మంది రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ పేర్కొంది. యుద్ధాన్ని ఆపడానికి, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే, అధ్యక్షుడు జెలెన్స్కీ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ, నాటో నేరుగా పాల్గొనడానికి లేదా ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను ఏర్పాటు చేయడానికి నిరాకరించింది. ఉక్రెయిన్, రష్యాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఉక్రేనియన్ అధికారులతో చర్చలు జరుపుతున్న రష్యా ప్రతినిధి బృందం శుక్రవారం ఒక ఒప్పందానికి దగ్గరగా వచ్చాయని చెప్పారు. (చదవండి: పాపం మూగజీవాలు..యుద్ధం వల్ల మనుషులకే కాదు పశువులకు ఇబ్బందులే!) -
ప్రాణవాయువుతో పనిలేని జీవి
భూమి మీద జీవించే ప్రతి జీవికి ప్రాణవాయువు అవసరం. అదే లేకుంటే ఏ జీవి ప్రాణాలతో జీవించలేదు. కానీ, ఓ జీవి మాత్రం ఆక్సిజన్ లేకుండానే జీవించగలదు. పేరు ‘హెన్నెగుయా సాల్మినికోలా’. ఇదొక టాడ్‌పోల్ లాంటి పరాన్నజీవి. అంటే నీటిలో జీవించే ఓ అక్వాటిక్ లార్వా. అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించినపుడు ఈ పరాన్నజీవికి మైటోకాండ్రియల్ జన్యువులు లేనట్లు గుర్తించారు. ఈ జన్యువు శక్తిని ఉత్పత్తి చేయడానికి ఆక్సిజన్‌పై ఆధారపడి ఉంటుంది. దీంతో, ఈ పరాన్నజీవికి ఆక్సిజన్ అవసరం ఉండదు. అమీబా, శిలీంధ్రాలు వంటి ఏకకణ జీవులు కూడా వాయురహిత వాతావరణంలో జీవించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికి, వాటికి కొంతైనా ఆక్సిజన్ అవసరం ఉంటుంది. కానీ, వీటికి ఆ కొంత ఆక్సిజన్ కూడా అవసరంలేదట. అయితే, మరి దేనిని ఉపయోగించి ఈ పరాన్నజీవి శక్తిని ఉత్పత్తి చేస్తోందో ఇంకా కనుగొనలేదు. త్వరలోనే గుర్తిస్తామని పరిశోధకులు చెప్తున్నారు. ఏదిఏమైనా.. ప్రాణవాయువు లేకుండా ప్రాణాలతో జీవించగల జీవి ఇప్పటి వరకు ఇది ఒక్కటే! (క్లిక్: సైకోలా మారిన ఉడత.. 18 మందిపై దాడి!) -
భలే ప్లాన్
గాల్లో బెలూన్లు ఎగరేసి ఎంజాయ్ చేస్తున్నారు నిత్యామీనన్. ‘బ్రీత్’ వెబ్ సిరీస్ సీజన్ 2 షూటింగ్ పూర్తికావడమే ఈ ఆనందానికి కారణం. ‘‘బ్రీత్’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. ఒకరినొకరం బాగా మిస్ అవబోతున్నాం అని చెప్పడానికి బాధగా ఉంది. ఇప్పటివరకు యాక్టింగ్‌లో నా బెస్ట్ టైమ్ ఇదేనని భావిస్తున్నాను’’ అన్నారు నిత్యా. ‘బ్రీత్’ సెకండ్ సీజన్లో అభిషేక్ బచ్చన్ నటించారు. ఫస్ట్ సీజన్లో మాధవన్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అన్నట్లు .. ఇంకో విషయం ఏంటంటే వెబ్‌సిరీస్‌లో నిత్యా నటించడం ఇదే తొలిసారి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌వైపు మళ్లిన నిత్యాకు చేతిలో సినిమాలు లేవనుకుంటే మాత్రం పొరపాటే. ‘మిషన్ మంగళ్’ సినిమాతో ఈ ఏడాదే బాలీవుడ్ డోర్ కొట్టిన ఈ బ్యూటీ సౌత్‌లోనూ మస్త్ బిజీగా ఉన్నారు. తమిళంలో సైకో, ది ఐరన్‌లేడీ (జయలలిత బయోపిక్) సినిమాలతో పాటు కొన్ని మలయాళ చిత్రాలు చేస్తున్నారు. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్‌లో నటించడానికి కథలు వింటున్నారట. ఇలా సినిమాలు, డిజిటల్ సెక్టార్‌ని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను భలేగా ప్లాన్ చేసుకుంటున్నారు నిత్యామీనన్. -
మరో వెబ్ సిరీస్‌లో...
వెబ్ సిరీస్‌లకి ఇప్పుడు ఎంతక్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌తో పాటు మరికొన్ని పెద్ద పెద్ద సంస్థలు వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు ముందుకు వస్తున్నాయి. ఒరిజినల్ వెబ్ సిరీస్‌లకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నటించేందుకు సినిమా స్టార్స్ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కూడా ‘బ్రీత్ 2’ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఆయన ‘సైడ్ హీరో’ అనే వెబ్ సిరీస్‌లో అతిథి పాత్రలో అలరించారు. కానీ ‘బ్రీత్’ సీజన్ 2లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించనున్నారు. మయాంక్ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ సిరీస్‌ని అమెజాన్ ప్రైమ్ నిర్మించనుంది. ‘బ్రీత్’లో ఇన్వెస్టిగేటివ్ పోలీసాఫీసర్‌గా కనిపించిన అమిత్ సాద్ ‘బ్రీత్ 2’లో కూడా అదే పాత్ర చేయనున్నారు. -
ఊపిరి చినుకులు
- పంట చేలకు ఊరటనిచ్చిన తాజా వానలు - పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. వాడిపోతున్న పంటలకు ప్రాణం - చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - రెండ్రోజుల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం - గోదావరి నదికి భారీగా వరద నీరు - ఖమ్మం జిల్లాలో పొంగుతున్నవాగులు, వంకలు - అయినా రాష్ట్రంలో నేటికీ లోటు వర్షపాతమే - ఈ వానలు 15 రోజుల ముందు కురిసి ఉంటే చాలా పంటలు దక్కేవంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఒక మోస్తరు.. ఆ తర్వాత రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా పాల్వంచలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరంతా గోదావరిలో కలుస్తుండడంతో నది ఉధృతి పెరుగుతోంది. వాజేడు మండలంలోని చీకుపల్లి వాగు పొంగుతుండడంతో రెండ్రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల చెరువులు కళకళలాడుతున్నాయి. మొత్తమ్మీద ప్రస్తుత వర్షాలు.. వర్షాభావంతో వాడిపోతున్న పంటలకు ప్రాణాలు పోశాయి. గత 24 గంటల్లో గోవిందారావుపేట, భద్రాచలంలో 7 సెంటీమీటర్లు, కొత్తగూడెంలో 6, నవాబ్‌పేటలో 5, మహబూబాబాద్, ధర్మపురిలో 4, సరూర్‌నగర్, ములుగు, అశ్వారావుపేట, బయ్యారం, కూనవరం, జూలూరుపాడు, ముల్కలపల్లి, గోల్కొండ, సంగారెడ్డి, టేకులపల్లి, బాన్స్వాడలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. అయినా 22 శాతం లోటు.. వర్షాలు కురుస్తున్నప్పటికీ గత నెల ప్రభావం నుంచి రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. జూలైలో వర్షాలు అసలే లేకపోవడంతో ఆ లోటును ప్రస్తుతం కురుస్తున్న వానలు పూడ్చలేకపోతున్నాయి. ఆదివారం నాటికి రాష్ట్రంలో ఇంకా 22 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఖమ్మం, వరంగల్ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. మెదక్ జిల్లాలో అత్యధికంగా 58%, మహబూబ్‌నగర్‌లో 51%, నిజామాబాద్, హైదరాబాద్‌లో 47 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. వచ్చేనెలలో వర్షాలు పూర్తిస్థాయిలో ఉంటేగానీ లోటు తగ్గదని అధికారులు అంటున్నారు. కాస్త ముందు కురిసి ఉంటే.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు 15 రోజుల క్రితం పడి ఉంటే రాష్ట్రంలోని అన్ని పంటలకు ప్రయోజనం కలిగి ఉండేదని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో పంటలు పూర్తి స్థాయిలో చేతికి అందడం కష్టమేనని అంటున్నారు. మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పంటల ఎదుగుదల ఉండదని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఫలితంగా పంటల దిగుబడి తగ్గుతుందని స్పష్టం చేస్తోంది. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో మాత్రమే పంటల పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని సుమారు 3 లక్షల ఎకరాల్లోని పత్తి, మొక్కజొన్న ఎండిపోయిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆ పంటలకు ఈ వర్షాలతో ప్రయోజనం ఉండదని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంటల దిగుబడి సగానికి తగ్గుతుందని సర్కారు కూడా అంచనాకు వచ్చింది. అయితే ఈ వర్షాలు ముందస్తు రబీ పంటలకు ప్రయోజకరంగా ఉంటాయని వ్యవసాయ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కె.రాములు పేర్కొన్నారు. నారుమడి ఉంటే వరి నాట్లు వేసుకోవచ్చని ఆయన సూచించారు. ఉరకలేస్తున్న గోదావరి భద్రాచలం టౌన్: భద్రాచలం వద్ద గోదావరి ఉరకలేస్తోంది. శనివారం రాత్రి 29 అడుగులు ఉన్న నీటిమట్టం ఆదివారం సాయంత్రం 36.3 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఆ అవకాశం లేనప్పటికీ ముందు జాగ్రత్తగా కిందిస్థారుు సిబ్బందిని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. -
బాల్యం ‘ఊపిరి’కి కాలుష్యం తూట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్కూలుకు వెళుతున్న చిన్నారుల్లో దాదాపు 35 శాతం మందికి ఊపిరితిత్తులు మొరాయిస్తున్నాయి. ఎదిగే వయసులో ఉన్న బాలల లేత ఊపిరితిత్తులకు నాణ్యత లేని గాలి వల్ల తూట్లు పడుతున్నాయి. అంతిమంగా నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం బాల్యం ఊపిరి తీస్తోంది! ముఖ్యంగా ప్రధాన నగరాల్లో పరిస్థితి మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 8-14 ఏళ్ల మధ్య ఉన్న 2 వేల మంది స్కూలు విద్యార్థులపై నిర్వహించిన ‘బ్రీత్ బ్లూ-15’ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సర్వేలో తేలిన ముఖ్యాంశాలు... {బీత్ బ్లూ సర్వేలో భాగంగా.. 2 వేల మంది బాలలకు ఊపిరితిత్తుల ఆరోగ్య పరీక్ష(లంగ్ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్-ఎల్‌హెచ్‌ఎస్‌టీ) నిర్వహించగా, ఏకంగా 35 శాతం మంది ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయడం లేదని తేలింది. ఇక వాయు కాలుష్య నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఢిల్లీలో 21 శాతం మంది విద్యార్థుల ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తక్కువగా(పూర్‌గా), మరో 19 శాతం మంది ఊపిరితిత్తుల పనితీరు అథమస్థాయిలో(బ్యాడ్‌గా) ఉంది. మొత్తంగా 40 శాతం మంది చిన్నారుల శ్వాస అవయవాలు సాధారణ స్థాయిలో పనిచేయడం లేదు. వాయుకాలుష్యంపై ప్రజల అవగాహనను తెలుసుకునేందుకు ‘క్లీన్ ఎయిర్ ఇండియా మూవ్మెంట్’ సంస్థ నిర్వహించిన ‘పౌరుల అవగాహన-దక్పథం సర్వే’ ప్రకారం.. వాయు కాలుష్యాన్ని నివారించే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, తాము చేయాల్సిందేమీ లేదని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. వాయు కాలుష్యానికి ప్రజలు కూడా బాధ్యులేనని ఢిల్లీలో 15 శాతం, ముంబైలో 24 శాతం, బెంగళూరులో 27 శాతం, కోల్‌కతాలో 9 శాతం మంది మాత్రమే అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ద్విచక్ర వాహనదారులు 46 శాతం, నాన్ ఏసీ కారు ఓనర్లు 63 శాతం, ఏసీ కారు ఓనర్లు 96 శాతం మంది వాహనాలు ఎక్కువసేపు నిలిపినప్పుడు నిర్లక్ష్యంతో ఇంజిన్ ఆపివేయడంలేదు. పరీక్షించిన అంశాలు ఇవే... ఊపిరితిత్తులు ఎంత గాలిని పీల్చుకుంటున్నాయి? బయటికి, లోపలికి గాలి ఎంత వేగంగా వెళ్తోంది? ఎంత ఆక్సిజన్‌ను పీల్చుకుని, ఎంత కార్బన్ డయాక్సైడ్ను వదులుతున్నాయి? ఊపిరితిత్తులకు ఇతర సమస్యలు, జబ్బులు వచ్చాయా? వంటి అంశాలను ఎల్హెచ్ఎస్టీలో పరీక్షించారు. ఇందులో ప్రతికూల ఫలితాలు వస్తే.. భవిష్యత్తులో తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
జాతీయం:అసలు శ్వాస సమయం
Hardly have time to breathe అర్థం: Hardly have time to breathe = To be very busy. వాక్య ప్రయోగం: I hardly had time to breathe while I was preparing for group-I examinations. గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమయ్యే రోజుల్లో నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం దొరికేది కాదు. వివరణ: ఈ జాతీయంలో ఏ్చటఛీడ స్థానంలో ఛ్చిటఛ్ఛిడ, ఆ్చట్ఛడ పదాలను కూడా వాడవచ్చు. ‘చాలీ చాలనంతగా’, ‘అరుదుగా’ అనే అర్థాలతో వీటిని వాడతారు. Hardly, barely, scarcely, rarely, seldom లాంటి పదాలను Nagative meaning-ful words అంటారు. ఇవి Not అనే పదం లేకున్నా నెగటివ్ అర్థాన్నిస్తాయి. ‘ఊపిరి పీల్చడానికి కూడా సమయం లేనంతగా’, ‘తీవ్రమైన పని ఒత్తిడి’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతారు. They made him work so hard that he scarcely had time to breathe అంటే ‘వారు అతడికి ఊపిరి పీల్చుకోలేనంత పని కల్పించారు’ అని అర్థం. నిరంతరం పనిలో నిమగ్నమయ్యే విషయం తెలియజేయడానికి తేనెటీగ, చీమను ఉదహరిస్తారు. దీనికి సమానార్థం ఇచ్చే ప్రయోగంగా అట busy as a bee ని చెప్పుకోవచ్చు. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com