భూమి మీద జీవించే ప్రతి జీవికి ప్రాణవాయువు అవసరం. అదే లేకుంటే ఏ జీవి ప్రాణాలతో జీవించలేదు. కానీ, ఓ జీవి మాత్రం ఆక్సిజన్ లేకుండానే జీవించగలదు. పేరు ‘హెన్నెగుయా సాల్మినికోలా’. ఇదొక టాడ్‌పోల్ లాంటి పరాన్నజీవి. అంటే నీటిలో జీవించే ఓ అక్వాటిక్ లార్వా. అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించినపుడు ఈ పరాన్నజీవికి మైటోకాండ్రియల్ జన్యువులు లేనట్లు గుర్తించారు. ఈ జన్యువు శక్తిని ఉత్పత్తి చేయడానికి ఆక్సిజన్‌పై ఆధారపడి ఉంటుంది. దీంతో, ఈ పరాన్నజీవికి ఆక్సిజన్ అవసరం ఉండదు.
అమీబా, శిలీంధ్రాలు వంటి ఏకకణ జీవులు కూడా వాయురహిత వాతావరణంలో జీవించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికి, వాటికి కొంతైనా ఆక్సిజన్ అవసరం ఉంటుంది. కానీ, వీటికి ఆ కొంత ఆక్సిజన్ కూడా అవసరంలేదట. అయితే, మరి దేనిని ఉపయోగించి ఈ పరాన్నజీవి శక్తిని ఉత్పత్తి చేస్తోందో ఇంకా కనుగొనలేదు. త్వరలోనే గుర్తిస్తామని పరిశోధకులు చెప్తున్నారు. ఏదిఏమైనా.. ప్రాణవాయువు లేకుండా ప్రాణాలతో జీవించగల జీవి ఇప్పటి వరకు ఇది ఒక్కటే! (క్లిక్: సైకోలా మారిన ఉడత.. 18 మందిపై దాడి!)
Comments
Please login to add a commentAdd a comment