Lot of smoke in Kyiv, people can't breathe properly: రష్యా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున క్షిపణి దాడులు నిర్వహిస్తోంది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ మొత్తం దట్టమైన పొగ మేఘంతో కప్పబడి ఉంది. దీంతో ఉక్రెయిన్ అధికారులు గాలి నాణ్యత.. అనారోగ్యకరమైన స్థాయిలో ఉందని నివాసితులు తమ కిటికీలు తెరవవద్దని, అనవసరంగా తమ ఇళ్లను విడిచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక వాయు నాణ్యత మార్గదర్శక విలువ కంటే ప్రస్తుతం కీవ్‌లోని గాలిలో కాలుష్య కారకాల సాంద్రత 27.8 రెట్లు ఎక్కువగా ఉందని ఓ నివేదిక తెలిపింది.
మార్చి19 నుంచి వాయు నాణ్యత ప్రమాదకరంగా ఉందని నివేదిక పేర్కొంది. అంతేకాదు కీవ్‌లో పొగ ఎక్కువగా ఉందని, ప్రజలు సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. అతేకాదు గాలిలో పొగలు కమ్ముకుంటున్నందున ప్రజలు తమ కిటికీలు తెరవవద్దని, అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నగర పాలక సంస్థ కూడా ప్రజలను కోరింది. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి కీవ్‌లో అనేక పేలుళ్లు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది.
ఉక్రెయిన్- రష్యా వార్ ముఖ్యాంశాలు
- ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ప్రకటించి 24 రోజులైంది.
- ఐక్యరాజ్యసమిది నివేదిక ప్రకారం, 3.2 మిలియన్ల మంది ప్రజలు దేశం నుంచి పారిపోగా, మరో 6.5 మిలియన్ల మంది ఉక్రెయిన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
- ఈ యుద్ధంలో వందలాది మంది పౌరులతో పాటు, 112 మంది పిల్లలు మరణించారని దాదాపు 13 వేల మంది రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ పేర్కొంది.
- యుద్ధాన్ని ఆపడానికి, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే, అధ్యక్షుడు జెలెన్‌స్కీ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ, నాటో నేరుగా పాల్గొనడానికి లేదా ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను ఏర్పాటు చేయడానికి నిరాకరించింది.
- ఉక్రెయిన్, రష్యాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఉక్రేనియన్ అధికారులతో చర్చలు జరుపుతున్న రష్యా ప్రతినిధి బృందం శుక్రవారం ఒక ఒప్పందానికి దగ్గరగా వచ్చాయని చెప్పారు.
(చదవండి: పాపం మూగజీవాలు..యుద్ధం వల్ల మనుషులకే కాదు పశువులకు ఇబ్బందులే!)
Comments
Please login to add a commentAdd a comment