Rana Naidu 2: గెట్‌ రెడీ..రానా నాయుడు సీజన్‌-2 వచ్చేస్తోంది | Rana Daggubati And Venkatesh Starrer Rana Naidu Season 2 At Netflix | Sakshi
Sakshi News home page

Rana Naidu 2: గెట్‌ రెడీ..రానా నాయుడు సీజన్‌-2 వచ్చేస్తోంది

Published Wed, Apr 19 2023 4:31 PM | Last Updated on Wed, Apr 19 2023 5:13 PM

Rana Daggubati And Venkatesh Starrer Rana Naidu Season 2 At Netflix - Sakshi

దగ్గుబాటి హీరోలు వెంకటేశ్‌, రానాలు తొలిసారి కలిసి నటించిన వెబ్‌సిరీస్‌ రానా నాయుడు. ఇటీవల విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయిన ఈ సిరీస్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక వ్యూవర్‌ షిప్‌లోనూ రానా నాయుడు దూసుకుపోతుంది.

ఓటీటీలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న రానా నాయడు  ఇప్పుడు సీజన్‌-2తో వచ్చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్స్‌ అనౌన్స్‌ చేసింది. ఈ మేరకు గ్లింప్స్‌ వీడియోను కూడా రిలీజ్‌ చేసింది. 'బాధపడకండి, మీ సమస్యలన్నీ సరిచేసేందుకు నాయుడులు తిరిగొస్తున్నారు.

రానా నాయుడు సీజన్ 2 త్వరలో రాబోతోంది'.. అంటూ నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసిన వీడియో నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోంది. కాగా కంటెంట్‌ పరంగా ఈ సిరీస్‌కు మంచి పేరొచ్చినా, అశ్లీలత, అసభ్యకర సన్నివేశాలతో విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. మరి సీజన్‌-2 ఏ విధంగా ఉండనుందన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement