ఓటీటీల్లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీసులు సూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి లిస్టులో కచ్చితంగా ఉండే సిరీస్ 'స్క్విడ్ గేమ్'. 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్.. ఊహించిన దానికంటే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా తీసిన రెండో సీజన్‌కి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు. అలానే మూడో సీజన్ గురించి కూడా అప్‌డేట్ ఇచ్చేశారు.
(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం)
ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ వెబ్ సిరీసుల్లో 'స్క్విడ్ గేమ్' ఒకటి. తొమ్మిది ఎపిసోడ్స్‌తో తీశారు. క్షణక్షణం టెన్షన్ అనిపించే థ్రిల్లింగ్ అంశాలతో దీన్ని తెరకెక్కించారు. అప్పట్లో వరల్డ్ మోస్ట్ పాపులర్ సిరీస్‍గా నిలిచింది. చిన్నచిన్న గేమ్‍లతోనే ఉండే ఈ స్క్విడ్ గేమ్‍లలో ప్రాణాలను కాపాడుకునేందుకు కంటెస్టెంట్లు చేసే పోరాటాన్ని చూపించారు.
హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ రెండో సీజన్‌ని ఈ ఏడాది డిసెంబరు 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తొలి సీజన్‌లానే ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా ఉండనుంది. అలానే వచ్చే ఏడాది మూడో సీజన్ కూడా తీసుకొస్తామని, దీంతో సిరీస్‌కి ముగింపు ఇస్తామని ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)
Comments
Please login to add a commentAdd a comment