కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం | Choreographer Sekhar Master Brother Passed Away | Sakshi
Sakshi News home page

Sekhar Master: ఇంట్లో విషాదం.. శేఖర్ మాస్టర్ ఎమోషనల్

Aug 1 2024 7:17 AM | Updated on Aug 1 2024 9:49 AM

Choreographer Sekhar Master Brother Passed Away

టాలీవుడ్ లీడింగ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. తోడబుట్టిన తమ్ముడు కన్నుమూశారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇన్ స్టా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ అనసూయ తన సంతాపాన్ని తెలియజేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో శేఖర్ మాస్టర్ వదిన చనిపోయారు.

(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌పై కేసు నమోదు..?)

'నిన్ను మిస్ అవుతున్నాం సుధా. ఎక్కడికెళ్లినా ఏం చేసినా నువ్వే గుర్తొస్తావ్. నువ్వు చనిపోయావనే చేదు నిజాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. ఎక్కడో ఓ చోట నువ్వు ఆనందంగా ఉంటావని అనుకుంటున్నాను. ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావ్. మిస్ యూ రా తమ్ముడు' అని శేఖర్ మాస్టర్ పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయ్యాడు.

'ఢీ' డ్యాన్స్ షోతో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్.. తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి స్టార్స్‌తో కలిసి పనిచేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డ్యాన్స్ మాస్టర‌గా కొనసాగుతున్నాడు.

(ఇదీ చదవండి: నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి.. లావణ్య అబార్షన్‌పై రాజ్‌ తరుణ్‌ రియాక్షన్‌)

Advertisement
 
Advertisement
Advertisement