బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌పై కేసు నమోదు..? | Bigg Boss Fame Mahaboob Birthday Party Issue | Sakshi
Sakshi News home page

బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌పై కేసు నమోదు..?

Jul 31 2024 2:37 PM | Updated on Jul 31 2024 3:38 PM

Bigg Boss Fame Mahaboob Birthday Party Issue

బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్‌ దిల్‌సే తాజాగా పుట్టినరోజు తన సన్నిహితులతో జరుపుకున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన పార్టీలో పలువురు సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటులు హాజరయ్యారు. అయితే, అనుమతలు లేకుండా పార్టీ నిర్వహించారని పోలీసులు గుర్తించారు. దీంతో మెహబూబ్‌తో పాటు రిసార్ట్‌ యజమాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో ఉండే కాంటినెంట్ రిసార్ట్‌లో మెహబూబ్‌ బర్త్‌డే పార్టీ జరిగింది. అందులో చాలామంది యువతీయువకులు పాల్గొన్నారు. రిసార్ట్‌లలోకి అనుమతి లేకుండా మద్యం తెచ్చుకుని సేవించడం నేరం అని ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం పార్టీలకు అనుమతి లేదని వారు తెలిపారు.

పార్టీలో 11 లీటర్ల మద్యంతో పాటు 7 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు చెప్పారు. మెహబూబ్‌ పార్టీలు పాల్గొన్న కొందరు మాత్రమే మద్యం సేవించినట్లు తెలుస్తోంది. వారి వద్ద ఎలాంటి డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలు లేవని సమాచారం. తన పుట్టినరోజు సందర్భంగా అనాథ ఆశ్రమంలో కేక్‌ కట్‌ చేసిన మహబూబ్‌ ఆపై అక్కడ ఉన్న వారందరికీ ఒక పూట భోజనం అందించాడు. వారందరితో సరదాగ గడిపి ఫోటోలు దిగాడు. అయితే, తన స్నేహితులకు ఇచ్చిన పార్టీ వల్ల ఆయన చిక్కుల్లో పడినట్లు అయింది. ఈ అంశం గురించి మెహబూబ్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement