'ఈ గేమ్ ఆడితే అందరం చస్తాం'.. భయపెట్టిస్తోన్న టీజర్! | Squid Game Season 2 Official Telugu Teaser out Now | Sakshi

Squid Game Season 2: 'ప్రాణాలు పణంగా పెట్టి ఆడే గేమ్'.. తెలుగు టీజర్ చూశారా?

Nov 1 2024 10:49 AM | Updated on Nov 1 2024 11:00 AM

Squid Game Season 2 Official Telugu  Teaser out Now

ప్రస్తుతం సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో సిద్ధమైంది. 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్‌లో తెరకెక్కించిన ఈ సిరీస్‌ ఇండియాలో క్రేజ్‌ను దక్కించుకుంది.

ఈ వెబ్ సిరీస్‌ దక్కిన ఆదరణతో స్క్విడ్‌ గేమ్‌  సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్‌-2 టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులోనూ విడుదలైన ఈ టీజర్‌ మరింత ఆకట్టుకుంటోంది.  గ్రీన్‌ లైట్‌, రెడ్‌ లైట్‌ వంటి గేమ్స్‌ ఈ సీజన్‌లో చూపించనున్నారు. టీజర్‌లో సన్నివేశాలు చూస్తుంటే హారర్‌ థ్రిల్లర్‌ లాంటి ఫీలింగ్‌ వస్తోంది. గేమ్‌లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్‌ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్‌ గేమ్‌ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement