'ఎలిమినేట్ అయితే చంపేస్తారు'.. స్క్విడ్‌ గేమ్‌ ట్రైలర్ చూశారా? | Korean Web Series Squid Game 2 Telugu Trailer Out Now | Sakshi
Sakshi News home page

Squid Game 2 Telugu Trailer: 'ప్రపంచం మారితేగానీ ఈ గేమ్ ఆగదు'.. ఉత్కంఠగా ట్రైలర్!

Published Wed, Nov 27 2024 5:21 PM | Last Updated on Wed, Nov 27 2024 5:21 PM

Korean Web Series Squid Game 2 Telugu Trailer Out Now

2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్‌లో తెరకెక్కించిన ఈ సిరీస్‌ ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్‌కు దక్కిన ఆదరణతో స్క్విడ్‌ గేమ్‌  సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్‌-2 ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి సీజన్‌ లాగే ఆర్థికంగా ఇబ్బందులు  పడే కొంతమంది వ్యక్తులు.. డబ్బు సంపాదించడం కోసం ఈ గేమ్‌లో భాగమవుతారని ట్రైలర్‌ చూస్తేనే తెలుస్తోంది.

తెలుగులోనూ విడుదలైన ట్రైలర్‌ ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్‌ లైట్‌, రెడ్‌ లైట్‌ వంటి గేమ్స్‌ ఈ సీజన్‌లో చూపించనున్నారు.  ట్రైలర్‌లో సన్నివేశాలు, ప్రమాదకరమైన గేమ్స్‌ చూస్తుంటే హారర్‌ థ్రిల్లర్‌ లాంటి ఫీలింగ్‌ వస్తోంది. గేమ్‌లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్‌ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్‌ గేమ్‌ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

అసలు ఈ స్క్విడ్‌ గేమ్‌ ఏంటంటే..

జీవితంలో అప్పులపాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్‌, గ్రీన్‌లైట్‌, టగ్ ఆఫ్‌ వార్‌ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే పోటీలు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం సిక్స్ గేమ్స్ ఉంటాయి. చివరి గేమ్ పేరే స్క్విడ్‌ గేమ్‌. అయితే ఈ గేమ్స్‌లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్‌ పేరుతో చంపేస్తుంటారు. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement