ఇటీవల విడుదలై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోన్న వెబ్ సిరీస్ స్క్విడ్‌గేమ్-2(Squid Game-2) . గతంలో వచ్చిన సీజన్-1కు కొనసాగింపుగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు స్క్విడ్ గేమ్ -3 కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అది పొరపాటుగా పోస్ట్ చేశామని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్‌కు(web series) ఇండియాలోనూ ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. ఈ సిరీస్ అంతా ఆడియన్స్‌ను ఉత్కంఠకు గురి చేస్తుంది.
అంతలా ఆదరణ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్‌లో మన హీరోలు నటిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహా ఎంత బాగుందో కదా? మరి అదే నిజమైతే బాగుండని మీకు అనిపిస్తోంది కదా? అవును.. మన హీరోలు ఆ గేమ్‌ను ఎలా ఆడతారో అనే ఆసక్తి ప్రతి ఒక్క సినీ ప్రియుడికి ఉంటుంది. అందుకే అసాధ్యం కాని వాటిన సుసాధ్యం చేయొచ్చని మరోసారి నిరూపించారు. అదెవరో కాదండి.. అదే మానవాళికి సవాలు విసురుతోన్న ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్). తాజాగా ఏఐ సాయం రూపొందించిన స్క్విడ్ గేమ్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
ఈ వీడియోలో మన స్టార్ హీరోలు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్ కల్యాణ్, ప్రభాస్ వీరంతా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు హీరోలు, కమెడియన్స్ సైతం ఈ స్క్విడ్‌గేమ్ వెబ్‌సిరీస్‌లోని పాత్రలతో వీడియోను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేసిన ఈ వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అభిమాన హీరోల ఏఐ ఇమేజ్‌ల వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్‌ల్లో స్క్విడ్ గేమ్ ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన స్క్విడ్‌గేమ్ సీజన్-2 ఓటీటీలో రికార్టులు సృష్టిస్తోంది. మొదటివారంలోనే అత్యధికంగా 68 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 92 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ర్యాకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
సీజన్-3పై అప్‌డేట్..
స్క్విడ్ గేమ్ సీజన్-2కు (Squid Game Season-2) ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇటీవలే సీజన్-3 అప్‌డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. కొత్త ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత పొరపాటున డేట్ రివీల్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.
స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..
ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!
జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్‌గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ.
This is so good !! AI Generated !! 💥💥💥#SquidGameSeason2 ft #TFI pic.twitter.com/QqAyf3kTQ8
— Priyanka Reddy - Rayalaseema 🌬 (@BerrySmile112) January 7, 2025
Comments
Please login to add a commentAdd a comment