డైరెక్టర్ మహి వీ రాఘవ సినీ ఇండస్ట్రీలో చాలామందికి తెలిసి ఉండదు. ఆయన దర్శకుడిగా తీసింది మూడు సినిమాలే అయినా మహీ వి రాఘవది శైలి వేరు. పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర లాంటి చిత్రాలతో డిఫరెంట్ జానర్స్‌తో సినీ ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మరోసారి సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్‌కు మహీ వి రాఘవ్ కథను అందించగా.. తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను మహీ సొంత నిర్మాణ సంస్ధ త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ప్రస్తుతం ఈ కామెడీ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది.
(ఇది చదవండి: ‘యాత్ర’.. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం)
ఇటీవలే ఓటీటీ విడుదలైన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. కరోనా టైంలో దొరికిన గ్యాప్‌లోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మహి కథ, కథనాన్ని అందించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన 'సేవ్ ది టైగర్స్' భార్యభర్తల మధ్య రిలేషన్స్, కుటుంబంలో ఉండే ఎమోషన్స్‌ను చక్కగా తెరకెక్కించారు. కాగా.. ఆయన త్వరలోనే బోల్డ్ కంటెంట్‌తో ఓటీటీలోకి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో ప్రియదర్శి, అభినవ్, రోహిణి, చైతన్యతో పాటు తదితరులు నటించారు.
(ఇది చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్)
Comments
Please login to add a commentAdd a comment