
‘యాత్ర 2’ పోస్టర్
‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అంటూ ‘యాత్ర 2’ సినిమా పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ (2019) సినిమా మంచి విజయం అందుకుంది. ‘యాత్ర’ కి సీక్వెల్‌గా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్‌తో ‘యాత్ర 2’ ఉంటుందని మహీ వి.రాఘవ్ గతంలోనే ప్రకటించారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ అప్‌డేట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వారం ముందే అప్‌డేట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది చిత్రయూనిట్. మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో వి.సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మించనున్న ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. ఇందులో జగన్ పాత్రలో ‘రంగం’ మూవీ ఫేమ్ జీవా నటించనున్నారు. ఆగస్టు 3 నుంచి ‘యాత్ర 2’ షూటింగ్ మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment