అల్లు అరవింద్, మమ్ముట్టి
‘‘పవన్ కల్యాణ్‌తో తీయబోయే సినిమాలో విలన్ పాత్ర చేయగలరా? అని పదేళ్ల క్రితం మమ్ముట్టిని అడిగితే, ఇదే ప్రశ్న చిరంజీవిని అడగగలరా అన్నాడు. మమ్ముట్టి వ్యక్తిత్వానికి అది నిదర్శనం’’ అన్నారు అల్లు అరవింద్. మమ్ముట్టి లీడ్ రోల్‌లో పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మామాంగం’. ఈ సినిమా తెలుగు, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో ఈ నెల 12న విడుదలవుతోంది.
తెలుగులో విడుదల చేస్తున్న అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘కేరళలోని చావెరుక్కల్ యుద్ధ వీరులకు గొప్ప చరిత్ర ఉంది. కలరీ యుద్ధ విద్యలో ఆరితేరిన వారి కథతో మమ్ముట్టి ఈ సినిమా చేయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘మామాంగం’ కేరళకు సంబంధించిన కథే కాదు. ప్రతి భారతీయుడు దీని గురించి తెలుసుకోవాలి. ప్రతి 12 ఏళ్లకు జరిగే మామాంగం అనే ఉత్సవం నేపథ్యంలో ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు మమ్ముట్టి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మహి.వి రాఘవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment