అమెరికాలో 'యాత్ర- 2' ప్రీమియర్స్‌ సిద్ధం.. అభిమానుల భారీ ర్యాలీ | Yatra 2 Movie Premiere Show Tickets Now Open In USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో 'యాత్ర- 2' ప్రీమియర్స్‌ సిద్ధం.. అభిమానుల భారీ ర్యాలీ

Published Tue, Feb 6 2024 11:24 AM | Last Updated on Tue, Feb 6 2024 11:39 AM

Yatra Movie Premiere Show Tickets Open Now In USA - Sakshi

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌,ట్రైలర​్‌కు భారీ రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా వైఎస్సార్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అమెరికాలో నివసిస్తున్న వైఎస్సార్‌, ఆయన తనయుడు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి గారి అభిమానులు అందరూ యాత్ర సినిమా విడదుల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కొన్ని వందల కార్లు, బైకులతో యాత్ర పోస్టర్స్‌ పట్టుకుని రోడ్‌ షో నిర్వహించారు. అమెరికాలో విడుదలకు ముందే యాత్ర జండా రెపరెపలాడుతుంది. సినిమా విడుదల కోసం ఎంతగానో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్‌, డల్లాస్‌లో ఫిబ్రవరి 7న యాత్ర 2 ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని ఫ్యాన్స్‌ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచే అమెరికాలో ప్రీమియర్‌ షోలు ఉండనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

ఈ చిత్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్‌ జగన్‌ పాత్రలో జీవా నటించారు. మహి. వి. రాఘవ్‌ దర్శకత్వంలో త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. జగన్‌ రెడ్డి కడపోడు సార్‌.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్‌ (శుభలేక సుధాకర్‌) ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఈ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను,  నేను విన్నాను... నేనున్నాను (జీవా) అనే డైలాగ్స్‌ ట్రైలర్‌ ఉన్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇవన్నీ భారీగా ట్రెండ్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement