
మహానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పథకాలతో లబ్ధి పొందని తెలుగు ప్రజలంటూ దాదాపుగా ఉండరు. ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక సహాయాన్ని, ప్రయోజనాన్ని పొందే ఉంటారు. ఫీ రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత్ విద్యుత్‌లాంటి వినూత్న పథకాలతో వైఎస్సార్ తన పాలనలో ప్రజలపై చెరగని ముద్ర వేశారు. మహానేత మరణించి ఇన్నేళ్లైనా.. జనం గుండెళ్లో ఆయనపై ఉన్న అభిమానం మాత్రం చెక్కు చెదరలేదు. చిరంజీవిగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానాయకుడు చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ప్రజలతో కలిసి, వారితో నడిచి, కన్నీళ్లను తుడుస్తూ.. చేపట్టిన పాదయాత్ర.. రాజన్ననను ప్రజలకు మరింత దగ్గర చేసింది. అప్పటి పాదయాత్ర స్మృతులతో పాటు ఎన్నో ఘటనలను యాత్ర పేరుతో వెండితెరపై ఆవిష్కరించబోతోన్న సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటిస్తుండగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ‘సాక్షి’ - యాత్ర సినిమాను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. రాజన్న ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఏ విధంగా ప్రయోజనం పొందారు? ఆయనతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీకు కలిగిన అనుభం, సందర్భాన్ని గురించి నాలుగు విషయాలను కింద పేర్కొన్న ఈ మెయిల్ కు పంపించండి. (టికెట్లు అందజేయడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా ఈ కాంటెస్ట్ హైదరాబాద్‌లో నివసిస్తున్న వారికి మాత్రమే పరిమితం) వైఎస్ తో ఉన్న మీ అనుబంధం, అనుభవాన్ని పంచుకోవడానికి మీరు చెప్పే సందర్భం, సన్నివేశం వివరాలతో పాటు మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ తో సహా info@sakshi.com కు మెయిల్ చేయగలరు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నవారిలో కొందరిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. కాంటెస్ట్‌లో పాల్గొనండి. టిక్కెట్లు పొందండి.
Comments
Please login to add a commentAdd a comment