బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ అనగానే చాలామందికి 'మీర్జాపుర్' గుర్తొస్తుందేమో. ఇప్పుడు దాన్ని తలదన్నే రీతిలో 'సైతాన్' సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఈ సిరీస్ లో బూతులు, అడల్ట్ సీన్స్ లెక్కకు మించి ఉన్నప్పటికీ.. ఎమోషన్ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయింది. దీంతో సిరీస్ సూపర్ హిట్ అయింది. డైరెక్టర్ మహీ వి రాఘవపై ప్రముఖ ఓటీటీల కన్ను పడింది.
ప్రొడ్యూసర్ టూ డైరెక్టర్!
టాలీవుడ్ లో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన మహీ వి రాఘవ.. 'విలేజ్ లో వినాయకుడు', 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలు తీశాడు. కానీ ఆ రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. దీంతో తనలోని దర్శకుడుని బయటకు తీశాడు. 'పాఠశాల', 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. కాస్తంత గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు.
(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!)
ఓటీటీలతో మరింత క్రేజ్
ఇప్పటివరకు బిగ్ స్క్రీన్ పై తన సత్తా చూపించిన మహీ వి రాఘవ.. హాట్ స్టార్ కోసం రెండు సిరీస్ లు ప్లాన్ చేశాడు. రీసెంట్ గా విడుదలైన ఈ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ఒకటి 'సేవ్ ద టైగర్స్'. కామెడీ స్టోరీతో సిరీస్ తీసినా సక్సెస్ సాధించొచ్చని ఇది ప్రూవ్ చేసింది. ఈ సిరీస్ కి రైటర్ కమ్ ప్రొడ్యూసర్ గా చేసిన మహీ.. షో రన్నర్ గా వ్యవహరించారు. డైరెక్షన్ చేయలేదు. 'సైతాన్' వెబ్ సిరీస్ కి మాత్రం అన్నీ తానై వ్యవహరించాడు. బ్లాక్ బస్టర్ విజయం అందుకున‍్నాడు. ఈ క్రమంలోనే తన క్రేజ్ చాలా పెంచేసుకున్నాడు.
ముందుంది పెద్ద టాస్క్
డైరెక్టర్ మహీ వి రాఘవ.. ప్రస్తుతం 'సిద్దా లోకం ఎలా ఉంది నాయనా' సినిమా చేశాడు. ఇది రిలీజ్ కు రెడీగా ఉంది. అటు సినిమాలు, ఇటు ఓటీటీల్లో వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉన‍్న ఇతడు.. రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడా అనేది పెద్ద టాస్క్. ఎందుకంటే దేనికి దానికి సెపరేట్ ఆడియెన్స్ ఉంటారు కదా! ఇదంతా కాదన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ జీవితం ఆధారంగా 'యాత్ర 2' తీయబోతున్నాడు. మహీ సక్సెస్ దెబ్బకు ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి.
(ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?)
Comments
Please login to add a commentAdd a comment