
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఘట్టాన్ని వెండితెరపై యాత్ర పేరుతో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సాంగ్స్, టీజర్స్, పోస్టర్స్‌తో ఈ మూవీ అంచనాలను మించిపోయింది. నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
ఇక ఈ సినిమాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ రాజన్నను గుర్తుకు తెచ్చుకుని.. నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయామని..‘యాత్ర’ సినిమా కాదు.. మహానాయకుడి జీవితం.. రాజన్న వ్యక్తిత్వానికి నిలువుటద్దం.. ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్దమయ్యే రాజన్న తెగువ, ధైర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని, సినిమా చూస్తున్నంత సేపు రాజన్నను చూస్తున్నట్టే ఉందని రాజన్నకు యాత్ర ఘన నివాళి అంటూ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. (‘యాత్ర’ మూవీ రివ్యూ) విడుదల అన్ని కేంద్రాల్లో వైఎస్‌ఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రాగా.. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన స్పీచ్‌తో అందరినీ కంటతడి పెట్టించిన అసిస్టెంట్ డైరెక్టర్ వైఎస్ చిత్ర పటానికి పూల మాల వేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు.
చదవండి : ‘యాత్ర’ మూవీ రివ్యూ
(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment