పులివెందులలో 'యాత్ర 2'... పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్ | YS Jagan Mohan Reddy Yatra 2 Movie Shooting Latest | Sakshi
Sakshi News home page

Yatra 2 Movie: జనంతో జగన్.. పోస్టర్ మాత్రం వేరే లెవల్

Published Wed, Oct 18 2023 6:00 PM | Last Updated on Wed, Oct 18 2023 6:58 PM

YS Jagan Mohan Reddy Yatra 2 Movie Shooting Latest - Sakshi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'యాత్ర 2'. 2018లో రిలీజైన 'యాత్ర' చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే ఫస్ట్‪‌లుక్ రిలీజ్ చేయగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. జగన్ పాత్రలో జీవాని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అలా సెట్ అయిపోయాడు మరి.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'జబర్దస్త్'ని మించిపోయిందిగా!)

ఇప్పటికే షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. తాజాగా చివరి షెడ్యూల్‌ని సీఎం జగన్ సొంతూరు పులివెందులలో చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన డైరెక్టర్ మహీ వి రాఘవ.. పవర్‌ఫుల్ పోస్టర్స్ షేర్ చేయడంతో పాటు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తాజాగా ఫొటోల్లో జగన్ పాత్రధారి జనంతో ఉంటూ వాళ్ల బాగోగులు తెలుసుకుంటూ కనిపించారు.

'జగన్ పాత్రలో జీవా జీవించేశాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఫిబ్రవరి 8న యాత్ర 2 రిలీజైన తర్వాత ప్రతిఒక్కరూ ఇదే మాట చెబుతారు. నాతో ఏకీభవిస్తారు' అని డైరెక్టర్ మహీ వి రాఘవ రాసుకొచ్చాడు. 'యాత్ర' సినిమాలో వైఎస్ పాదయాత్ర పరిణామాల్ని చూపించారు. ఇక సీక్వెల్‌లో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్సార్సీపీ ఆవిర్భావం, పాదయాత్ర, భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి కావడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తదితర విషయాల్ని చూపించబోతున్నారని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

(ఇదీ చదవండి: స్టార్ హీరో 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement