దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆదారంగా తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లోనూ ఒకేసారి విడుదలైంది. ఈ సందర్భంగా చెన్నైలోని వైఎస్‌ఆర్ అభిమానులు థియేటర్లలో సంబరాలు చేసుకున్నారు. చెన్నైలోని 13 థియేటర్లలో యాత్ర రిలీజ్ కాగా ప్రతీ థియేటర్‌లోనూ పండుగ వాతావరణం కనిపించింది. (‘సినిమా చూస్తున్నంతసేపు గుండె బరువెక్కింది’)
ఈ చిత్రం తమ మహానేత ఇంకా మా గుండెల్లో కొలువై ఉన్నాడని నిరూపించిందని అభిమానులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. వైఎస్‌ఆర్ పాదయాత్ర ద్వారా దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించి తనదైన బాణిలో బడుగు బలహీర వర్గాలకు దేవుడిగా నిలిచిన తీరు సినిమాలో కళ్లకుకట్టినట్టుందన్నారు. చెన్నైలోని మాయాజాల్, ఏజీఎస్, పాలాజ్జో మల్టీప్లెక్స్ లతోపాటు వివిధ ప్రాంతాల్లో థియేటర్లలో యాత్ర తెలుగు వెర్షన్ విడుదలైంది. (చదవండి : ‘యాత్ర’ మూవీ రివ్యూ)
దీంతో ఆయా థియేటర్ల ముందు అభిమానులు బారులు తీరీ జోహార్ వైఎస్‌ఆర్ అంటూ తమ మహానేత తలుచుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ప్రేక్షకులు సినిమా చూసి వైఎస్‌ఆర్ గొప్ప హృదయాన్ని ప్రశంసిస్తున్నారు. ఇక వివిధ కళాశాలలు, సత్యభామ, ఎస్ఆర్ఎం విద్యావిద్యాలయాలా విద్యార్ధులు జయహో వైఎస్సార్ అంటూ యాత్ర సినిమా కోసం చేస్తున్న సందడి చెన్నై నగరంలోని తెలుగు వారిలో వైఎస్‌ఆర్ పట్ల ఉన్న అభిమానాన్ని గుర్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment