దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మహానేత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని సినిమాగా తెరకెక్కించటంలో మీరు చూపించిన అభిరుచి, అంకిత భావానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు’ అంటూ చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులను అభినందించారు.
మమ్ముట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేశారు.
Congratulations @MahiVraghav @devireddyshashi @VijayChilla @ShivaMeka @mammukka & entire crew on the successful release of #Yatra.I wholeheartedly thank you & appreciate your passion & dedication in wanting to depict cinematically,the character & essence of the great leader,YSR.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 10 February 2019
Comments
Please login to add a commentAdd a comment