Yatra 2 Movie Official Release Date, First Look Poster Out - Sakshi
Sakshi News home page

Yatra 2: గుర్తుపెట్టుకోండి..నేను వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకుని.. ‘యాత్ర-2’ పోస్టర్‌ వైరల్‌

Published Sun, Jul 2 2023 11:35 AM | Last Updated on Sun, Jul 2 2023 12:33 PM

Yatra 2 Movie Release Date Out, First Look Poster Goes Viral - Sakshi

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ మూవీ ‘యాత్ర’. వైఎస్సార్‌ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నాలుగేళ్ల క్రితం(2019) విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లోనే ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉటుందని ప్రకటించాడు దర్శకుడు మహి వి.రాఘవ్‌.

ఈ సీక్వెల్‌లో  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుందని ఇటీవల రివీల్‌ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని జులై 8న వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ వారం ముందే ‘యాత్ర-2’ రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు మహి. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. 

(చదవండి: సినీ తారల ‘వ్యాపారం’.. సైడ్‌ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న స్టార్స్‌ వీరే!)

తాజాగా రిలీజైన పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఈ పోస్టర్‌పై ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకుని’అనే లైన్స్‌ ‘యాత్ర 2’ కథేంటో తెలియజేస్తుంది. వైఎస్సార్‌ మరణానంతరం వైఎస్‌ జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్ర మొదలు.. సీఎం పీఠం ఎక్కే వరకు ఆయనకు ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో యాత్ర 2 కథ సాగుతుందని పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది.

సీఎం జగన్‌ చేపట్టిన పాదయాత్రను హైలెట్‌ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. సీఎం జగన్ పాత్ర పోషించేదెవరనేది ఇంతవరకు ప్రకటించలేదు కానీ తమిళ హీరో జీవా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement