Director Mahi V Raghav Interesting Comments About CM Jagan Biopic Yatra 2 Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Yatra 2 Movie: సీఎం జగన్‌ జీవితంలో ఎత్తుపల్లాలున్నాయి.. వాటినే ‘యాత్ర 2’లో చూపిస్తాం

Published Sat, Jul 8 2023 3:14 PM | Last Updated on Sat, Jul 8 2023 3:37 PM

Mahi V Raghav Talk About Yatra 2 Movie - Sakshi

‘కథను ఎంచుకునేటప్పుడు ఓ మేకర్‌గా కమర్షియల్ కోణంలో సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయా? లేదా? అన్నది ఆలోచిస్తాం. యాత్రలో ఓ రాజకీయ నాయకుడి తన గురించి తాను తెలుసుకోవడం, ప్రజల కష్టాలను తెలుసుకోవడం, ఆయన ఏంటన్నది ప్రజలు తెలుసుకోవడం ఉంటుంది. యాత్ర 2లో 2009 నుంచి 2019 వరకు జగన్ మోహన్ రెడ్డి గారి పీరియడ్‌ను చూపిస్తాను.  ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను’అని దర్శకుడు మహి వి. రాఘవ్‌ అన్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం యాత్ర 2.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి(జులై 8) సందర్భంగా నేడు యాత్ర 2 మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మహి వి.రాఘవ్‌ మీడియాతో మాట్లాడుతూ ముచ్చటించారు. ఆ విశేషాలు..

తండ్రి  ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్ చుట్టూ  యాత్ర 2 కథ నడుస్తుంది.  సీఎం జగన్‌ ఎక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టారు.. ఎక్కడి వరకు ఎదిగారు అన్నదే ఈ సినిమాలో చూపిస్తున్నాం. యాత్రకి, యాత్ర 2కి కథ పరంగా ఏ సంబంధం ఉండదు.

 యథార్థ సంఘటనలే అయినా కూడా జనాలను ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు ఫిక్షన్ యాడ్ చేస్తాం. రెండు గంటల్లో కథను చెప్పాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేస్తాను.ఈ సినిమాతో ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకోవద్దు. సినిమా చూసి ఎమోషనల్ అవుతారు.. పోలింగ్ బూత్‌లో వాళ్లకు నచ్చిన వాళ్లకు ఓటు వేస్తారు.

► జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎత్తుపల్లాలున్నాయి. వాటినే సినిమాలో చూపిస్తాం. జగన్ అనే ఓ రాజకీయ నాయకుడి కథను చెప్పబోతోన్నాం

►  పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్.. ఇలాంటి సినిమాలు ఎప్పుడు, ఏ టైంలో రిలీజ్ చేస్తామనేది ముఖ్యం. అందుకే ఎన్నికల టైంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం

► ఆర్జీవీ గారు తీసే వ్యూహం మాపై ఎలాంటి ప్రభావం చూపదు. త్వరలోనే నటీనటుల వివరాలను ప్రకటిస్తాం. శివ మేక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మధి సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement