‘సేవ్ ద టైగర్స్’వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ మహి వి. రాఘవ్. ఈ కామెడీ వెబ్ సిరీస్‌కి మహి క్రియేటివ్ ప్రొడ్యూసర్, షో రన్నర్‌గా వ్యవహరించారు. ప్రతి ఇంట్లో భార్య భర్తల మధ్య జరిగే గొడవల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇదే జోష్‌లో మరో వెబ్ సిరీస్‌ని విడుదల చేయబోతున్నాడు మహి. అదే ‘సైతాన్’. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇప్పటి వరకు కామెడీ అండ్ ఎమోషనల్ కథలనే తెరకెక్కించిన మహి..ఇప్పుడు క్రైమ్ నేపథ్యంలో ‘సైతాన్’ని తెరకెక్కించడం విశేషం. ‘సైతాన్' ఫస్ట్ లుక్ చూస్తే... నలుగురు కలిసి ఓ పోలీసును హత్య చేసినట్టు అర్థం అవుతోంది. ఎందుకు చంపారు? అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. 'మీరు నేరం అని దేనిని అయితే అంటున్నారో... వాళ్ళు దానిని మనుగడ కోసం చేసిన పనిగా చెబుతున్నారు'' అని మహి వి. రాఘవ్ పేర్కొన్నారు. క్రైమ్ జానర్ ప్రాజెక్ట్ చేయడం ఆయనకు ఇదే తొలిసారి.
దేవయాని శర్మ, మలయాళీ నటి షెల్లీ నబు కుమార్, నటుడు రిషి, జాఫర్ సాధిక్ కీలక పాత్రలు పోషించిన ఈ ఫుల్ లెంగ్త్ క్రైమ్ సిరీస్ ఈ నెల 15న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment