‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా! | Yatra Director Mahi V Raghav Next Project SYNDICATE | Sakshi
Sakshi News home page

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

Published Thu, Aug 1 2019 12:24 PM | Last Updated on Thu, Aug 1 2019 1:53 PM

Yatra Director Mahi V Raghav Next Project SYNDICATE - Sakshi

పాఠశాల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మహి వీ రాఘవ్‌ ఆనందో బ్రహ్మ సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్‌ అందుకున్నాడు. తరువాత దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. యాత్ర తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న మహి, తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు.

మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు మహి. ‘ఓ దర్శకుడు కథ చెప్పటం కన్నా, ఏ కథ చెప్పాలి అని నిర్ణయించుకోవటమే కష్టమైన పని. బాక్సాఫీస్ ట్రెండ్స్‌, బడ్జెట్‌, నటీనటులు ఇవేవి కథ ఎంపికకు సాయపడవు. నిశ్శబ్ధంలో వచ్చే ఓ ఆలోచన.. ఇదే నువ్వు చెప్పాల్సిన కథ అని నాకు తెలియజేస్తుంది. నా తదుపరి చిత్రం ఓ యాక్షన్‌ డ్రామా. టైటిల్‌ ‘సిండికేట్‌’. త్వరలోనే ఈ కథ, పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా, ఆ స్క్రిప్ట్ సినిమాగా వస్తుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement