mahi v raghava
-
యాత్ర-2 నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్
యాత్ర -2 నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'చూడు నాన్న' వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర-2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్ రిలీజ్ అయింది. 'చూడు నాన్న' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఎమోషన్స్‌తో కూడిన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవా తనదైన నటనతో మెప్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈపాట ఉండటంతో అందరినీ మెప్పిస్తుంది. తండ్రి మరణంతో మొదటిసారి ప్రజల్లో అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకే వేలాదిగా జనాలు వచ్చారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను పాటలో చూపించారు డైరెక్టర్ మహి వి రాఘవ్. -
'యాత్ర 2'.. సోనియా పాత్రలో కనిపించనున్న నటి ఎవరో తెలుసా..?
మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాత్ర 2లో సోనియా పాత్రను జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ పోషించారు. ఆమె పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. 'మీరు అతన్ని ఓడించలేకపోతే.. అతన్ని నాశనం చేయండి’ అనే ట్యాగ్‌లైన్‌ను ఆ ఫోటోకు జోడించారు. సుజానే బెర్నెర్ట్ జర్మనీలో పుట్టి పెరిగారు. కమర్షియల్ యాడ్స్, హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆమె సోనియాగా ఎలా మెప్పించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. యాత్ర 2కి సోనియాకి ఉన్న సంబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని అప్పట్లో తెరకెక్కించారు. అత్యంత ప్రజాదరణను పొందిన ఈ చిత్రానికి కొనసాగింపుగా, వైఎస్.ఆర్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెరకెక్కిస్తున్నారు. ‘యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8, 2019లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. Their Paths crossed, The Dynasty Collapsed, The History changed !#Yatra2 #Yatra2OnFeb8th #LegacyLivesOn @ShivaMeka @Music_Santhosh @madhie1 #SelvaKumar @vcelluloidsoffl @3alproduction pic.twitter.com/GdVNLcIFsO — Mahi Vraghav (@MahiVraghav) November 7, 2023 -
యాత్ర- 2 ఆ రోజే ప్రకటన.. క్లూ ఇచ్చిన డైరెక్టర్
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర నేపథ్యంలో 2019లో వచ్చిన యాత్ర సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అప్పట్లో ప్రజలు ఎంతగానో ఆదరించారు . వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రలో చోటు చేసుకున్న కీలక సంఘటనలను యాత్రలో చూపించారు. (ఇదీ చదవండి: రాకేశ్ మాస్టర్ గురించి తొలిసారి రియాక్ట్ అయిన శేఖర్ మాస్టర్) తాజాగా మహి వి రాఘవ దర్శకత్వంతో పాటు పలు వెబ్ సీరిస్‌లను నిర్మిస్తున్నారు. ఆయన నుంచి వచ్చిన సేవ్ ది టైగర్స్, సైతాన్ వంటి వెబ్ సిరీస్‌లకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్థుతం ఆయన చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటని అందరిలోనూ ఆసక్తి ఉంది. సైతాన్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన యాత్ర-2 ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుందని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ క్రమంలో మహి వి రాఘవ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. తన ట్వీట్లో జూలై 8, 2023 అని మాత్రమే రాశారు. అదేరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కాబట్టి... ఆరోజు యాత్ర-2 గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాత్రలో తమిళ నటుడు జీవా నటించనున్నారని ప్రధానంగా వినిపిస్తోంది. July 8, 2023 — Mahi Vraghav (@MahiVraghav) June 28, 2023 (ఇదీ చదవండి: RRR: ఆస్కార్ సభ్యుల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయంటే) -
‘యాత్ర’.. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం
కొన్ని కథలు ప్రేక్షకులను అలరిస్తాయి.. ఆలోచింపజేస్తాయి. మరికొన్ని కథలు హృదయాలను హత్తుకుంటాయి. కన్నీళ్లను తెప్పిస్తాయి. అలా మనసుల్ని హత్తుకునే కథలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అలాంటి వాటిలో ‘యాత్ర’ ఒకటి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ఇది. వైఎస్సార్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్సార్.. పాదయాత్ర ద్వారా జనంలోకి ఎలా వెళ్లగలిగారు? సమస్యలు ఎలా తెలుసుకున్నారు? కష్టాలకు పట్టించుకోకుండా.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు? ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి? పాదయాత్ర రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది? యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి ? పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు? అన్నదే ఈ సినిమా కథ. ఒక సినిమాకు కథతో పాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్‌ని నిర్ణయిస్తుంది. వైఎస్సార్ పాత్రకు మలయాళ నటదిగ్గజం మమ్ముట్టిని ఎంపిక చేయడంతోనే ఈ సినిమా సగం విజయం సాధించింది. ‘యాత్ర’ సినిమా అనేది ఓ ఎమోషనల్ జర్నీ. ఇందులో పెద్దగా కథ కంటే పాత్రలే ముఖ్యం. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పెట్టి నటించాడు. ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు తెర మీద రాజన్ననే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు మమ్ముట్టి. రాజశేఖరరెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్‌లో వచ్చే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీన్స్ మరో ఎత్తు. అప్పటి వరకు వైఎస్సార్ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే రియల్ ఫుటేజ్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్ని బయోపిక్ మూవీస్‌లా కేవలం కథను మాత్రమే చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. అందుకే విమర్శకులు సైతం రాఘవపై ప్రశంసలు కురిపించారు. సూటిగా సుత్తి లేకుండా, చెప్పాల్సిన విషయాన్ని ఎమోషనల్‌గా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా.. కంటతడి పెట్టించేలా ‘యాత్ర’ను తీర్చి దిద్దారు. (యాత్ర సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి 8) నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా..) -
‘యాత్ర’ బ్లాక్‌బస్టర్ మీట్
-
వైఎస్‌గారి పాత్ర చేయడం నా అదృష్టం
‘‘యాత్ర’ సినిమాకి ముందు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆసక్తికరంగా అనిపించకపోవడంతో చేయలేదు. అయితే ‘యాత్ర’ సినిమాను కాదనలేకపోయాను. కథ బాగుంది.. మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ప్రజల నాయకుడైన ఒక గొప్ప రాజకీయ నాయకుడి కథ ఇది. ప్రజలను అర్థం చేసుకోకపోతే రాజకీయ నాయకుడు.. ప్రజానాయకుడు కావడం కష్టం. మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజలు మెచ్చిన నాయకుడే రూలర్ అవుతారు’’ అని హీరో మమ్ముట్టి అన్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం వైజాగ్‌లో నిర్వహించిన ‘బ్లాక్ట్‌బస్టర్ మీట్’లో మమ్ముట్టి మాట్లాడుతూ– ‘‘అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాదు.. నన్ను క్షమించండి. తెలుగు స్పష్టంగా మాట్లాడటం ఇంకా రాలేదు. నా డైలాగ్స్‌కు జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పుకున్నాను. ఉగ్రవాద దాడిలో అమరులైన వీరజవాన్లకు సెల్యూట్ చేస్తున్నాను. తెలుగులో ప్రత్యక్షంగా ‘యాత్ర’ నా మూడో చిత్రం. కె.విశ్వనాథ్‌గారితో ఒక సినిమా, ఉమా మహేశ్వరరావుగారితో మరో తెలుగు సినిమా చేశాను. ‘యాత్ర’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సాంగ్ షూట్ చేశాం. ఆ తర్వాత ఓ సీన్‌ను చిత్రీకరించాం. కాస్త భయం వేసింది.. నెర్వస్‌గా ఫీలయ్యాను. లక్కీగా ఆ సీన్ సినిమాలో లేదు. ఆ తర్వాత మ్యానేజ్ చేశాను. దర్శక–నిర్మాతలు నాకు మ్యాగ్జిమమ్ కంఫర్ట్ లెవల్స్ ఇచ్చారు. నా నుంచి కొత్తవిషయాలు నేర్చుకున్నానని మహి చెప్పారు. కానీ, నేర్చుకున్నది నేను. పాత్ర కోసం కొత్త భాష నేర్చుకున్నాను. సెట్లో ప్రతి రోజూ నాకు కొత్త రోజే. డైలాగ్స్ పలకడానికి సహకరించిన అసోసియేట్ డైరెక్టర్స్‌తో పాటు టీమ్ అందరికీ ధన్యవాదాలు. సినిమాల్లో నాకు అనుభవం ఎక్కువగా ఉండొచ్చు. కానీ తెలుగులో తక్కువ. సినిమా సక్సెస్ అయ్యింది. ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘యాత్ర’లో హీరో లేడు.. హీరోయిన్ లేదు.. ఫైట్స్ లేవు.. పాటలు, కామెడీ సీన్స్ లేవు.. అయినా ప్రేక్షకులు ఆదరించారు. సినిమాలను చూడటంలో వారి అభిరుచి మారింది. తెలుగులో మరిన్ని మంచి సినిమాలు రావాలి. విభిన్నమైన సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఆల్రెడీ పెరిగారు. వైఎస్‌ఆర్‌గారిలా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆయన పాత్రలో నటించడం నా అదృష్టం’’ అన్నారు. నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో మూడో సినిమా ‘యాత్ర’. మొదటి సినిమా ‘భలే మంచి రోజు’ చేసినప్పుడు బాగా పేరొచ్చింది కానీ డబ్బులు రాలేదు. రెండో సినిమా మహితో ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం చేసినప్పుడు బాగా డబ్బులు వచ్చాయి కానీ పెద్దగా పేరు రాలేదు. ‘యాత్ర’ మా మూడో సినిమా. ఈ చిత్రానికి మాకు ఎంత డబ్బు వచ్చిందో అంతకు మించి రెట్టింపు పేరొచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని వేల ఫోన్‌కాల్స్ వచ్చాయి. అందరూ ఒక్కటే మాట చెప్పారు. ‘మేం జీవితాంతం మీ రుణం తీర్చుకోలేం.. మా ముందుకు మళ్లీ వైఎస్ఆర్గారిని తీసుకొచ్చారు’ అనడంతో మేం పడ్డ ఏడాదిన్నర కష్టం మరచిపోయాం. ఈ సినిమాని చూసి విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. డిస్ట్రిబ్యూటర్లు కూడా కాల్ చేసి సంతోషం వ్యక్తం చేయడం వెరీ హ్యాపీ. ఈ సినిమా కేవలం డబ్బు కోసం తీయలేదు. వైఎస్‌గారి అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్స్ టు మమ్ముట్టిసార్.. వైఎస్‌గారిని మళ్లీ తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక నేను, మహి వెళ్లి జగన్ అన్నని కలిశాం.. ‘యాత్ర’ ప్రొడ్యూసర్.. రండి అని అన్న అనడంతో చాలా సంతోషం వేసింది’’ అన్నారు. దర్శకుడు మహి వి.రాఘవ్ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు నమ్మకపోతే ఈ సినిమా చేయడం అసాధ్యం. వైఎస్‌గారిపై అభిమానం వేరే, కృతజ్ఞత వేరే అని ఈ సినిమా ద్వారా తెలుసుకున్నా. వైఎస్‌గారిపై అభిమానం, ప్రేమకు మించిన ఒక భావం కానీ, ఏదైనా ఒక ఫీలింగ్ ఉందంటే అది కృతజ్ఞత. ఆయన్ను ప్రేమించేవారికి ఓ కృతజ్ఞత ఉంది. అది క్రీడాకారులకో, సినిమా వాళ్లకో రాదు.. అది అసాధ్యం. నేను ఇంకా పెద్ద సినిమాలు చేయొచ్చు.. ఎక్కువ డబ్బులు రావొచ్చేమో కానీ, నా జీవితంలో నాకు తెలిసి ఇంత కృతజ్ఞత కానీ, ప్రేమ కానీ రాదని కచ్చితంగా చెప్పగలను. ప్రేక్షకుల స్పందన చాలా బాగుంది. ఒకతను నాకు ఫోన్ చేసి, ‘ఓ వైపు కన్నీళ్లు వస్తున్నాయ్.. మరోవైపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాను’ అన్నాడు. ఓ మహిళ ఫోన్ చేసి, ‘ఇకపై రైతు మార్కెట్లో టమోటాని ధర కన్నా రెండు రూపాయలకు తక్కువ ఇమ్మని రైతులను అడగను’ అని చెప్పింది. ఓ కథ ఇంత ప్రభావం చూపిస్తుందని, ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుందని నేను అనుకోలేదు. జగనన్నకి కూడా థ్యాంక్స్. ఎన్నికలు ఉన్న ఏడాదిలో నేను ఎవర్నో కూడా తెలియకుండా నన్ను గుడ్డిగా నమ్మి ‘మీ నాయకుని కథ మీరు చెప్పుకోండి’ అన్నారు. ఆ మాట అనాలంటే నిజంగా ధైర్యం ఉండాలి. అందుకు అన్నకి థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాల్లో చాలామంది కడప కథలు చెప్పారు. తొలిసారి ఓ కడప బిడ్డ కథ చూపించాం. వైఎస్‌గారు కడపలో పుట్టినా ప్రతి గడపలోకి వచ్చారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో కూడా ఆయన్ని ప్రేమించారు. రాఘవేంద్రరావుగారు, రామ్‌గోపాల్‌వర్మగారు... ఇలా చాలామంది సినిమా బావుందని అభినందించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు అశ్రిత, ఉమ, ‘దిల్’ రమేశ్, దయానంద్, మొయినుద్దీన్, బాలనటి సహస్ర, శ్రీమిత్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘యాత్ర’పై స్పందించిన వైఎస్ విజయమ్మ
-
‘యాత్ర’పై స్పందించిన వైఎస్ విజయమ్మ
సాక్షి, హైదరాబాద్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్ర యూనిట్‌ను వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ అభినందించారు. ఈ చిత్రాన్ని తిలకించిన అనంతరం ఆమె సోమవారమిక్కడ మాట్లాడుతూ... యాత్ర సినిమాను చాలా బాగా తీశారు. కోట్లాది హృదయాంతరాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను ’యాత్ర’ ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారు. వైఎస్సార్ సజీవంగా మనముందు లేకపోయినా... యాత్ర చిత్రం ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని విజయమ్మ అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం వైఎస్సార్ కట్టుబడేవారని ఆమె తెలిపారు. ఈ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తడమే కాకుండా మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతోంది. కాగా అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా యాత్ర టీమ్‌కు అభినందనలు తెలిపారు. చిత్ర దర్శకుడు మహి వి.రాఘవ, నిర్మాతలు దేవిరెడ్డి శశి, విజయ్ చిల్లా, శివ మేకా, వైఎస్సార్ పాత్రధారి హీరో మమ్ముట్టి, ఇతర చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. -
‘యాత్ర’ బృందానికి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: యాత్ర సినిమాను విజయవంతంగా నిర్మించి విడుదల చేసిన మహి వి.రాఘవ, దేవిరెడ్డి శశి, విజయ్ చిల్లా, శివ మేకా, వైఎస్సార్ పాత్రధారి హీరో మమ్ముట్టిలకు, ఇతర చిత్ర బృందానికి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘యాత్ర సినిమా తీయడంలోనూ.. ఆ మహానేత జీవితంలోని వాస్తవాలను, వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహారశైలిని సినిమా రూపంలో ప్రతిబింబింపజేయడంలోనూ మీరు ప్రదర్శించిన అభిరుచి, అంకిత భావాలకు నేను మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని జగన్ ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. Congratulations @MahiVraghav @devireddyshashi @VijayChilla @ShivaMeka @mammukka & entire crew on the successful release of #Yatra.I wholeheartedly thank you & appreciate your passion & dedication in wanting to depict cinematically,the character & essence of the great leader,YSR. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2019 -
ప్రతి శుక్రవారం చాలా మారుతుంది
‘‘సినిమా ఫ్లాప్ అయినప్పుడు చాయిస్ ఉండదు. హిట్ అయితే నెక్ట్స్ డిఫరెంట్ సినిమా చేయడానికి చాన్స్ వస్తుంది. నా గత చిత్రం ‘ఆనందోబ్రహ్మా’ హిట్ సాధించడంతో ‘యాత్ర’ వంటి డిఫరెంట్ మూవీచేయగలిగా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం చాలా మారుతుంది’’ అని దర్శకుడు మహి వి. రాఘవ్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మహి చెప్పిన విషయాలు. ∙వైఎస్సార్‌గారి గురించి కావాలని చేసిన సినిమా కాదు ‘యాత్ర’. ఒక గొప్ప వ్యక్తి జీవిత కథను చెప్పే నైపుణ్యం నాలో ఇంకా రాలేదు. అయితే చాలామంది ఆయన గురించి చెప్పినవి, ఆయన చేసిన మంచి పనుల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నవి విని, స్ఫూర్తి పొందాను. వైఎస్సార్‌గారి గురించి కొందరిని అడిగినప్పుడు ఆయన ధైర్యసాహసాలు గురించి ఎక్కువగా చెప్పలేదు నాకు. ఆయన చేసిన మంచి పనులు, ప్రవేశపెట్టిన పథకాలు, జనరంజకమైన పాలన గురించే చెప్పారు. ఒక రాజకీయ నాయకుడి గురించి ప్రజలు ఇంత మంచిగా చెప్పడం తక్కువ. అప్పుడు అనిపించింది వైఎస్సార్‌గారి గురించి ఓ కథ చెప్పాలని. ఆయన జీవితం మొత్తం చూపించాలనుకోవడం లేదు. మనం ఎంచుకుంటున్నది వివాదాలు లేని పాదయాత్ర ఎపిసోడ్ అనుకుని కథ రాశాను. ∙ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల వల్ల వైఎస్సార్‌గా గుర్తుండిపోయారు. ఇలాంటి అంశాలు సబ్‌ప్లాట్స్‌గా ఉంటాయి సినిమాలో. వైఎస్సార్‌గారు పాదయాత్ర పూర్తిచేసిన వరకూ సినిమా ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆయన లైఫ్ గురించి బ్రీఫ్‌గా పెంచలదాస్గారి ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. ∙వైఎస్సార్‌గారి పాత్రకు మమ్ముట్టిగారైతే సరిగ్గా సరిపోతారని అనిపించింది మాకు. కథ విని మమ్ముట్టిగారు ఎగై్జట్ అయ్యారు. మమ్ముట్టిగారి దృష్టిలో పర్ఫార్మెన్స్ అంటే యాక్టింగ్ విత్ డబ్బింగ్. నిజంగా వేరే వారితో చెప్పించినా కూడా ఇప్పుడు మమ్ముట్టిగారు చెప్పినంత బాగా అవుట్‌పుట్ వచ్చేది కాదేమో. -
మమ్ముట్టి కెరీర్లో బిగెస్ట్ రిలీజ్ ‘యాత్ర’
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహి వి రాఘవ దర్శకుడు. చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజశేఖర్ రెడ్డి చేసిన పాద యాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ ఫిబ్రవరి 7న ప్రదర్శించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మమ్ముట్టి కెరీర్లోనే భారీ రిలీజ్‌గా రికార్డ్ సృష్టించినుంది యాత్ర. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుహాసిని, అనసూయ, పోసాని కృష్ణమురళి, రావూ రమేష్ ఇతర పాత్రలో కనిపించనున్నారు. -
‘యాత్ర’ ట్రైలర్ వచ్చేస్తోంది..!
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్అయిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. జవనరి 7 సాయంత్రం 5 గంటలకు యాత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. Join the remarkable #Yatra of our beloved leader Dr. YSR. #YatraTrailer will be out on 7th Jan at 5 pm.@mammukka @MahiVRaghav @VijayChilla @devireddyshashi #ShivaMeka @K_RiverRecords @70mmentertains @MangoMusicLabel #YatraOnFeb8th pic.twitter.com/UkBsLhcfX4 — #YatraOnFeb8th (@70mmEntertains) 6 January 2019 -
నేను విన్నాను.. నేనున్నాను..
తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత మహానేత వైఎస్ రాజశెఖరరెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన మేనియాతో తిరగరాసిన వైఎస్సార్ చేసిన పాదయాత్రను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు. కాగా, వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ఓ రైతు తను పడుతున్న కష్టాలను మహానేత దృష్టికి తీసుకువచ్చే సన్నివేశాన్ని ప్రధానంగా ట్రైలర్లో చూపించారు. ‘నీళ్లు ఉంటే కరెంట్ ఉండదు.. కరెంట్ ఉంటే నీళ్లు ఉండవు.. రెండు ఉండి పంట చేతికస్తే సరైన ధర ఉండదు.. అందరు రైతే రాజు అంటారు.. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్య.. మమ్మల్ని రాజులుగా కాదు.. కనీసం రైతులుగా బతకనివ్వండి’ అంటూ రైతు తన ఆవేదనను మహానేతతో పంచుకుంటారు. ట్రైలర్ చివర్లో మమ్ముట్టీ పలికే.. ‘నేను విన్నాను.. నేనున్నాను’ మాటలు వింటే.. ఆయన వైఎస్సార్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారా అనిపిస్తుంది. ఈ చిత్రం 2019 ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, గతంలో విడుదల చేసిన టీజర్‌కు, ఫస్ట్ లుక్కు తెలుగు రాష్ట్రాలోని ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. -
‘యాత్ర’ రిలీజ్ ఎప్పుడంటే..!
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లోనేరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి కాకపోవటంతో ఫిబ్రవరికి వాయిదా వేశారు. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2019 ఫిబ్రవరి 8న యాత్ర సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. A tribute to the greatest journey history has ever witnessed. #Yatra in cinemas from 8th Feb. A film by @MahiVRaghav.@mammukka @VijayChilla @devireddyshashi #ShivaMeka @K_RiverRecords @MangoMusicLabel #YatraOnFeb8th pic.twitter.com/tn4iGz82S2 — #YatraOnFeb8th (@70mmEntertains) 14 December 2018 -
‘యాత్ర’ విడుదల తేదీ ఖరారు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రం విడుదల తేదీని యూనిట్ సభ్యులు ఖరారు చేశారు. లెజెండరీ నటుడు మమ్ముట్టీ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం వినాయక చవితి సందర్భంగా బుధవారం విడుదల చేసింది. ప్రజానేత జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా ఈ చిత్రాన్ని ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి వీ రాఘవ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అందుకు కొన్ని రోజుల ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలో జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్. -
వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ టీజర్ రిలీజ్
-
యాత్ర టీజర్.. గడప కష్టాలు వినేందుకు రాజన్న...
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ టీజర్ రిలీజ్ అయ్యింది. మళయాళ మెగాస్టార్ మమ్ముటీ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి వీ రాఘవ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రజానేత జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా యాత్రను మహి రూపొందిస్తున్నారు. టీజర్ విషయానికొస్తే... పాదయాత్ర ప్రారంభించే ముందు వైఎస్సార్ మాటల్ని గుర్తు చేస్తూ టీజర్ ప్రారంభమైంది. ‘తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు, ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో... చరిత్రే నిర్ణయించుకోని’ అంటూ బ్యాక్ గ్రౌండ్లో డైలాగులు వినిపించాయి. పంచెకట్టులో రాజన్నను తలపిస్తూ.. అదే దరహాసం.. అదే తరహా అభివాదం ఓవరాల్‌గా మమ్ముట్టి.. లుక్ ఆకర్షించింది. ‘కే’ అందించిన బ్యాక్ గ్రౌడ్ స్కోర్ గూస్బమ్స్ తెప్పించేదిలా ఉంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. అతిత్వరలో యాత్రను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది. -
మాతో జీవితకాల ప్రయాణానికి సిద్ధంకండి!
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘షూ లేసులు కట్టుకోండి.. మాతో జీవితకాల ప్రయాణానికి సిద్ధంకండి’ అంటూ వైఎస్సార్ జయంతి కానుకగా ‘యాత్ర’ టీజర్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాలో మహానేత పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు. మహి వీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా, జగపతిబాబు, రావు రమేశ్, అనసూయ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. -
‘యాత్ర’లో అనసూయ?
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రముఖ యాంకర్ అనసూయ నటించనుందట. ఇటీవల రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఆకట్టుకున్న అనసూయ సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు. -
రీల్ వైఎస్సార్‌కు గ్రాండ్ వెల్కం
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మమ్ముట్టీని సెట్స్ లోకి ఆహ్వానించేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. మమ్ముట్టి పాత సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు చేస్తూ సెట్స్‌లోకి స్వాగతం పలికారు. చాలా కాలం తరువాత మమ్ముట్టి తెలుగు సినిమాలో నటిస్తుండటంతో చిత్ర యూనిట్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు. వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’కు సంబంధించిన మరిన్ని వార్తలకు ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి....! కడప దాటి వస్తున్నా ప్రతి గడపలోకి వస్తున్నా యాత్ర ఫస్ట్ లుక్.. వైఎస్సార్‌గా మెగాస్టార్ సబితగా సుహాసిని వైఎస్ బయోపిక్ యాత్ర.. అధికారిక ప్రకటన -
మమ్ముట్టీకి సెట్స్ లో గ్రాండ్ వెల్కం
-
పాఠశాల మూవీ ట్రైలర్ లాంచ్