యాత్ర సినిమా సెట్‌లో మమ్ముట‍్టి
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మమ్ముట్టీని సెట్స్ లోకి ఆహ్వానించేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. మమ్ముట్టి పాత సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు చేస్తూ సెట్స్‌లోకి స్వాగతం పలికారు.
చాలా కాలం తరువాత మమ్ముట్టి తెలుగు సినిమాలో నటిస్తుండటంతో చిత్ర యూనిట్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు.
వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’కు సంబంధించిన మరిన్ని వార్తలకు ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి....!
కడప దాటి వస్తున్నా
ప్రతి గడపలోకి వస్తున్నా
యాత్ర ఫస్ట్ లుక్.. వైఎస్సార్‌గా మెగాస్టార్
సబితగా సుహాసిని
వైఎస్ బయోపిక్ యాత్ర.. అధికారిక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment