మమ్ముట్టి కెరీర్‌లో బిగెస్ట్ రిలీజ్‌ ‘యాత్ర’ | Yatra Biggest Release In Mammootty Carrer | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 18 2019 12:18 PM | Last Updated on Fri, Jan 18 2019 12:18 PM

Yatra Biggest Release In Mammootty Carrer - Sakshi

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహి వి రాఘవ దర్శకుడు. చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాద యాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ కానుంది.

ఈ సినిమా యూఎస్‌ ప్రీమియర్స్ ఫిబ్రవరి 7న ప్రదర్శించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మమ్ముట్టి కెరీర్‌లోనే భారీ రిలీజ్‌గా రికార్డ్‌ సృష్టించినుంది యాత్ర. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుహాసిని, అనసూయ, పోసాని కృష్ణమురళి, రావూ రమేష్‌ ఇతర పాత్రలో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement