‘‘సినిమా ఫ్లాప్ అయినప్పుడు చాయిస్ ఉండదు. హిట్ అయితే నెక్ట్స్ డిఫరెంట్ సినిమా చేయడానికి చాన్స్ వస్తుంది. నా గత చిత్రం ‘ఆనందోబ్రహ్మా’ హిట్ సాధించడంతో ‘యాత్ర’ వంటి డిఫరెంట్ మూవీచేయగలిగా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం చాలా మారుతుంది’’ అని దర్శకుడు మహి వి. రాఘవ్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. వైఎస్‌ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మహి చెప్పిన విషయాలు.
∙వైఎస్సార్‌గారి గురించి కావాలని చేసిన సినిమా కాదు ‘యాత్ర’. ఒక గొప్ప వ్యక్తి జీవిత కథను చెప్పే నైపుణ్యం నాలో ఇంకా రాలేదు. అయితే చాలామంది ఆయన గురించి చెప్పినవి, ఆయన చేసిన మంచి పనుల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నవి విని, స్ఫూర్తి పొందాను. వైఎస్సార్‌గారి గురించి కొందరిని అడిగినప్పుడు ఆయన ధైర్యసాహసాలు గురించి ఎక్కువగా చెప్పలేదు నాకు. ఆయన చేసిన మంచి పనులు, ప్రవేశపెట్టిన పథకాలు, జనరంజకమైన పాలన గురించే చెప్పారు. ఒక రాజకీయ నాయకుడి గురించి ప్రజలు ఇంత మంచిగా చెప్పడం తక్కువ. అప్పుడు అనిపించింది వైఎస్సార్‌గారి గురించి ఓ కథ చెప్పాలని. ఆయన జీవితం మొత్తం చూపించాలనుకోవడం లేదు. మనం ఎంచుకుంటున్నది వివాదాలు లేని పాదయాత్ర ఎపిసోడ్ అనుకుని కథ రాశాను.
∙ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల వల్ల వైఎస్సార్‌గా గుర్తుండిపోయారు. ఇలాంటి అంశాలు సబ్‌ప్లాట్స్‌గా ఉంటాయి సినిమాలో. వైఎస్సార్‌గారు పాదయాత్ర పూర్తిచేసిన వరకూ సినిమా ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆయన లైఫ్ గురించి బ్రీఫ్‌గా పెంచలదాస్‌గారి ఎమోషనల్ సాంగ్ ఉంటుంది.
∙వైఎస్సార్‌గారి పాత్రకు మమ్ముట్టిగారైతే సరిగ్గా సరిపోతారని అనిపించింది మాకు. కథ విని మమ్ముట్టిగారు ఎగై్జట్ అయ్యారు. మమ్ముట్టిగారి దృష్టిలో పర్ఫార్మెన్స్ అంటే యాక్టింగ్ విత్ డబ్బింగ్. నిజంగా వేరే వారితో చెప్పించినా కూడా ఇప్పుడు మమ్ముట్టిగారు చెప్పినంత బాగా అవుట్‌పుట్ వచ్చేది కాదేమో.
Comments
Please login to add a commentAdd a comment