
హ్యూస్టన్ : మమ్ముట్టి లీడ్ రోల్‌లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’.. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చుట్టూ సాగే ఈ ‘యాత్ర’ ఆయన అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. యాత్ర చిత్ర విడుదల సందర్భంగా హ్యూస్టన్‌లో 200 కార్లతో వైఎస్సార్ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొని కేటీలోని సినేమార్క్ థియేటర్‌లో యాత్ర చ్రిత విడుదలను సంబరంగా జరుపుకున్నారు. సినిమా అయిపోయిన తరువాత అందరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ సందర్బంగా వారు చిత్ర దర్శకునికి, నిర్మాతలకు, చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
యాత్ర చిత్రాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, ఒక మనిషి మాట ఇచ్చిన తర్వాత ఎంత వరకైనా వెళ్లగలను అనడానికి వైఎస్సార్ ఒక గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. ఈ వేడుకల్లో సుమారు 300 మంది వైఎస్సార్ అభిమానులు పాల్గొని యాత్ర కేక్ కట్ చేశారు. జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలతో థియేటర్ మొత్తాన్ని హోరెతించారు. సినిమా విజయవంతం అయినందుకు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినిమాకి వచ్చిన అందరికి డిస్ట్రిబ్యూటర్ రఘువీర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు .





Comments
Please login to add a commentAdd a comment