‘యాత్ర’లో అనసూయ? | Anchor Anasuya In Ysr Biopic Yatra | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 30 2018 4:31 PM | Last Updated on Sat, Jun 30 2018 7:09 PM

Anchor Anasuya In Ysr Biopic Yatra - Sakshi

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రముఖ యాంకర్‌ అనసూయ నటించనుందట. ఇటీవల రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఆకట్టుకున్న అనసూయ సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు.

భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement