
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర నేపథ్యంలో 2019లో వచ్చిన యాత్ర సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అప్పట్లో ప్రజలు ఎంతగానో ఆదరించారు . వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రలో చోటు చేసుకున్న కీలక సంఘటనలను యాత్రలో చూపించారు.
(ఇదీ చదవండి: రాకేశ్ మాస్టర్ గురించి తొలిసారి రియాక్ట్ అయిన శేఖర్ మాస్టర్)
తాజాగా మహి వి రాఘవ దర్శకత్వంతో పాటు పలు వెబ్ సీరిస్‌లను నిర్మిస్తున్నారు. ఆయన నుంచి వచ్చిన సేవ్ ది టైగర్స్, సైతాన్ వంటి వెబ్ సిరీస్‌లకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్థుతం ఆయన చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటని అందరిలోనూ ఆసక్తి ఉంది. సైతాన్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన యాత్ర-2 ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుందని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ క్రమంలో మహి వి రాఘవ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. తన ట్వీట్‌లో జూలై 8, 2023 అని మాత్రమే రాశారు. అదేరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కాబట్టి... ఆరోజు యాత్ర-2 గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాత్రలో తమిళ నటుడు జీవా నటించనున్నారని ప్రధానంగా వినిపిస్తోంది.
July 8, 2023
— Mahi Vraghav (@MahiVraghav) June 28, 2023
(ఇదీ చదవండి: RRR: ఆస్కార్ సభ్యుల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయంటే)
Comments
Please login to add a commentAdd a comment