దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘షూ లేసులు కట్టుకోండి.. మాతో జీవితకాల ప్రయాణానికి సిద్ధంకండి’ అంటూ వైఎస్సార్ జయంతి కానుకగా ‘యాత్ర’ టీజర్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాలో మహానేత పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు.
మహి వీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా, జగపతిబాబు, రావు రమేశ్, అనసూయ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment