ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. ఉన్నంతలో 'ఊరి పేరు భైరవకోన' మాత్రమే ఎంటర్‌టైన్ చేస్తోంది. మరోవైపు ఈ వారమే రిలీజైన మలయాళ చిత్రాలు 'భ్రమయుగం', 'ప్రేమలు' హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే వీటి గురించి తెలుగు ప్రేక్షకుల డిస్కస్ చేస్తుండటమే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఈ రెండు మూవీస్‌లో అంతలా ఏముంది? కలెక్షన్స్ ఎంతనేది ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో సినిమా అంటే ఫుల్ కలర్ఫుల్గా ఉండాల్సిందే. కానీ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మాత్రం బ్లాక్ అండ్ వైట్ పద్ధతిలో తీసిన 'భ్రమయుగం'లో నటించాడు. నలుపు తెలుపు కలర్‌కి తోడు కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి ఆడియెన్స్ మెల్లమెల్లగా కనెక్ట్ అవుతున్నారు. స్టోరీ పరంగా అక్కడక్కడ ల్యాగ్ ఉన్నప్పటికీ.. యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ దీనికి డిమాండ్ గట్టిగానే ఉందండోయ్. రెండు రోజుల్లోనే దీనికి రూ.10 కోట్ల వరకు వసూళ్లు దక్కాయి.
(ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష)
'ప్రేమలు' అనే మలయాళ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ కూడా వారం క్రితం థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. బ్యాక్ డ్రాప్ అంతా దాదాపు హైదరాబాద్‌లోనే ఉండటంతో మనోళ్లు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. కలెక్షన్స్ కూడా రూ.35 కోట్లకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. రూ.5 కోట్లు పెట్టి తీస్తే ఈ రేంజు వసూళ్లు వచ్చేసరికి మన నిర్మాతలు కూడా దీన్ని రీమేక్ లేదంటే డబ్బింగ్ చేసేయాలని చూస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలు కూడా వేటికవే విభిన్నంగా ఉండటంతో పాటు కాస్త డిఫరెంట్ ఫీల్ ఇస్తున్నాయి. హారర్ థ్రిల్లర్ కథతో తీసిన 'భ్రమయుగం' కొందరికి కనెక్ట్ కాగా.. యూత్‌కి నచ్చే విషయంలో 'ప్రేమలు' ఫుల్ మార్క్స్ కొట్టేస్తోంది. టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్వరలో వీటిని తెలుగులో కూడా డబ్ చేసి వదలబోతున్నారట.
(ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు)
Comments
Please login to add a commentAdd a comment