సంక్రాంతి తర్వాత తెలుగులో పలు మీడియం రేంజ్ సినిమాలు రిలీజయ్యాయి. చాలావరకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అద్భుతమైన హిట్ గా నిలిచింది మాత్రం 'టిల్లు స్క్వేర్'నే. మరోవైపు మలయాళ డబ్బింగ్ చిత్రాలు మాత్రం వరసపెట్టి హిట్స్ కొడుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో క్రేజీ మూవీ చేరినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? దీని సంగతేంటి?
(ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్)
ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్.. రీసెంట్ టైంలో ఈ మలయాళ డబ్బింగ్ చిత్రాల గురించి తెలుగు ప్రేక్షకులు తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర రిలీజైతే చూసి ఆదరించడంతో పాట కోట్లకు కోట్లు కలెక్షన్స్ వచ్చేలా చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా ఒకటి చేరింది. 'ఆవేశం' అనే పేరున్న సినిమాతో హిట్ కొట్టేశాడు. తాజాగా మలయాళంలో రిలీజ్ కాగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
'ఆవేశం' కథ విషయానికొస్తే.. బెంగళూరులో చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు కుర్రాళ్లు సీనియర్లతో ర్యాగింగ్ గొడవ కారణంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. సిటీలో పేరుమోసిన రౌడీ అయిన రంగాని కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. ఇందులో రంగాగా చేసిన ఫహాద్ ఫాజిల్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశాడనే టాక్ వచ్చింది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే రిలీజైన ఈ చిత్రంపై ఆల్రెడీ తెలుగు నిర్మాతల దృష్టి పడిందట. 'పుష్ప'తో ఫహాద్ కి ఆల్రెడీ తెలుగులో మార్కెట్ ఉంది కాబట్టి త్వరలో 'ఆవేశం' రిలీజ్ పక్కా ఉంటుందట.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే)
Comments
Please login to add a commentAdd a comment