ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హిందీలో ‘జబ్ వియ్ మెట్, లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, హైవే’ వంటి సినిమాలను తీసిన ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటించనున్నారు. కాగా ఈ సినిమాకు ‘ఇడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్’అనే టైటిల్‌ను మేకర్స్ అనుకుంటున్నారని బాలీవుడ్ టాక్.
అంతేకాదు.. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలుకానుందని, వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఇంతియాజ్ అలీ సన్నాహాలు చేస్తున్నారట. మలయాళ నటుడిగా ఫాహద్ ఫాజిల్ హిందీ ప్రేక్షకులకు తెలుసు. అయితే ‘పుష్ప’ ఫ్రాంచైజీ సినిమాతో ఫాహద్ క్రేజ్ బాగా పెరిగింది. మరి.. ఆయన హిందీలో చేయబోయే తొలి సినిమా ఎలా ఉండ బోతుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment