రీసెంట్‌గా మలయాళంలో హిట్టయిన సినిమా 'పని'. ప్రముఖ నటుడు జోజూ జార్జ్.. ప్రధాన పాత్రలో నటించిన దర్శకత్వం వహించాడు. ఈ నెల 13న థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. అభినయ జోజూకి జోడీగా నటించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)
ఈ మూవీ డిసెంబర్ 20న సోనీ లివ్ ఓటీటీలో వస్తుందని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు తెలుగు రిలీజ్ ఉండటంతో డిజిటల్ స్ట్రీమింగ్ ఆలస్యంగానే ఉండనుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజవంశీ చెప్పారు. తెలుగు వెర్షన్.. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత తర్వాతే ఓటీటీలోకి వస్తుందని అన్నారు.
'పని' కథ విషయానికొస్తే.. రివేంజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతోనే తీశారు. కానీ జోజూ జార్జ్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని తెలుస్తోంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మలయాళంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేశాడు జోజూ జార్జ్. గతంలో తెలుగులో 'ఆదికేశవ' మూవీలో విలన్‌గా ఇతడు నటించాడు.
(ఇదీ చదవండి: పార్టీ చేసుకున్న 'పుష్ప'.. శ్రీవల్లి మిస్!)
Comments
Please login to add a commentAdd a comment