'పుష్ప 2'.. పాన్ ఇండియా హిట్ కొట్టేసింది. బాక్సాఫీస్ దగ్గర నమోదవుతున్న నంబర్స్ దీనికి నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో రూ.829 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. అయితే మూవీలో 'పార్టీ లేదా పుష్ప' అని డైలాగ్ ఉంటుంది కదా. మరి సినిమా ఇంత సక్సెస్ అయింది. దీంతో టీమ్ అంతా ఇప్పుడు పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: సడెన్‌గా ఓటీటీలో 'తంగలాన్' సినిమా)
తాజాగా జరిగిన ఈ పార్టీలో హీరో అల్లు అర్జున్‌తో పాటు డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు, 'కిస్సిక్' బ్యూటీ శ్రీలీల, దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ కూబా.. ఇలా అందరూ కనిపించారు. హీరోయిన్ శ్రీవల్లి మాత్రం కనిపించలేదు. ఆమె కూడా వచ్చుంటే ఫొటో నిండుగా ఉండేది. దాదాపు ఐదేళ్ల పాటు సినిమా కోసం కష్టపడ్డారు. ఇప్పుడు పార్టీ చేసుకుని ఫుల్ చిల్ అయినట్లున్నారు.
'పుష్ప 2' సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో బాగానే వసూళ్లు వస్తున్నాయి. ఉత్తరాదిలో మాత్రం ఎగబడి మరీ చూస్తున్నారు. ఎందుకంటే నాలుగు రోజుల్లో హిందీ వెర్షన్ నెట్ వసూళ్లే రూ.339 కోట్లు రావడం విశేషం. ప్రస్తుతం ఊపు చూస్తుంటే నేడో రేపో రూ.1000 కోట్ల మార్క్ దాటేస్తుంది. మరి మొత్తంగా 'బాహుబలి 2' రికార్డులని దాటేస్తుందా? దగ్గరకెళ్లి ఆగిపోతుందా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'పుష్ప2'పై సిద్ధార్థ్ వ్యాఖ్యలు.. అల్లు అర్జున్స్ ఫ్యాన్స్ ఆగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment